Times Now-ETG Surv కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం; పెరగనున్న కాంగ్రెస్ నెంబర్-times now etg survey declares another term for modi sarkar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Times Now-etg Surv కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం; పెరగనున్న కాంగ్రెస్ నెంబర్

Times Now-ETG Surv కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం; పెరగనున్న కాంగ్రెస్ నెంబర్

HT Telugu Desk HT Telugu
Apr 21, 2023 09:58 PM IST

Another term for Modi sarkar: కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేదే అధికారమని తాజా సర్వే ఒకటి తేల్చింది. ఎన్డీయేకు 292 నుంచి 338 సీట్ల వరకు వస్తాయని వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో) (PTI)

Another term for Modi sarkar: కేంద్రంలో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేదే అధికారమని టైమ్స్ నౌ - నవభారత్ (Times Now-ETG Survey) సర్వే తేల్చింది. ఎన్డీయేకు 292 నుంచి 338 సీట్ల వరకు వస్తాయని వెల్లడించింది.

Another term for Modi sarkar: కాంగ్రెస్ ఎంపీల సంఖ్య

ఈ ఎన్నికలతో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య పెరుగుతుందని సర్వే తేల్చింది. రాహుల్ గాంధీ అనర్హత, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, కొంత ప్రభుత్వ వ్యతిరేకతల ప్రభావంతో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి 106 నుంచి 144 వరకు ఎంపీ స్థానాలు దక్కవచ్చని ఆ సర్వే పేర్కొంది. మరోవైపు, రాహుల్ గాంధీ పై విధించిన అనర్హత వేటు రాహుల్ గాంధీకి సానుకూలంగా పరిణమిస్తుందా? అన్న ప్రశ్నకు 23 శాతం మంది అవునని సమాధానమిచ్చారు. 39% మంది మాత్రం ఆ ప్రభావం ఎన్నికలపై ఉండబోదని స్పష్టం చేశారు.

Another term for Modi sarkar: వైఎస్సార్సీపీకి 25 సీట్లు

2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 25 సీట్లు లభిస్తాయని టైమ్స్ నౌ సర్వే తేల్చింది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోందన్న అంచనాలను నేపథ్యంలో.. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేయనుందని ఈ సర్వే తేల్చడం విశేషం. మరోవైపు, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ 20 నుంచి 22 సీట్లు గెలుస్తుందని టైమ్స్ నౌ సర్వే అంచనా వేసింది. అలాగే, ఒడిశాలోని అధికార పార్టీ బిజూ జనతాదళ్ కు 11 నుంచి 13 సీట్లు వస్తాయని పేర్కొంది. అలాగే, ఇతరులు 50 నుంచి 80 సీట్లు గెల్చుకుంటారని వెల్లడించింది.

Whats_app_banner