Ola driver: ‘రాత్రికి వచ్చి నీ సంగతి చెప్తా..’: ప్రయాణికురాలిని బూతులు తిడుతూ ఓలా డ్రైవర్ దౌర్జన్యం-ill come back at night gurgaon womans terrifying encounter with ola driver ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ola Driver: ‘రాత్రికి వచ్చి నీ సంగతి చెప్తా..’: ప్రయాణికురాలిని బూతులు తిడుతూ ఓలా డ్రైవర్ దౌర్జన్యం

Ola driver: ‘రాత్రికి వచ్చి నీ సంగతి చెప్తా..’: ప్రయాణికురాలిని బూతులు తిడుతూ ఓలా డ్రైవర్ దౌర్జన్యం

HT Telugu Desk HT Telugu
Aug 21, 2024 04:35 PM IST

గుర్గావ్ కు చెందిన ఓ మహిళను ఓలా డ్రైవర్ వేధించడం, తీవ్రంగా బెదిరించడం ఓలా కస్టమర్ భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తన భయానక అనుభవాన్ని ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రయాణికురాలిని బూతులు తిడుతూ ఓలా డ్రైవర్ దౌర్జన్యం
ప్రయాణికురాలిని బూతులు తిడుతూ ఓలా డ్రైవర్ దౌర్జన్యం

గుర్గావ్ కు చెందిన ఒక మహిళకు ఇటీవల ఓలా రైడ్ సమయంలో భయానక అనుభవం ఎదురైంది. ఇది కస్టమర్ భద్రత గురించి ఆందోళన కలిగిస్తుంది. గుర్గావ్ కు చెందిన పూజా ఎస్ గత వారం ఉదయమే ఫ్లైట్ ఎక్కేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఏర్ పోర్ట్ వెళ్లడానికి..

వీలైనంత త్వరగా క్యాబ్ పొందే అవకాశాలను పెంచుకోవడానికి ఓలా, రాపిడో ల్లో క్యాబ్ కోసం మార్కెటింగ్ ప్రొఫెషనల్ అయిన ఆ మహిళ ప్రయత్నించారు. చివరకు, కంపెనీపై నమ్మకంతో ఓలాను ఎంచుకున్నారు. రైడ్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే డ్రైవర్ వాహనాన్ని ఆపి, ముందుగా క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లిస్తే తప్ప తీసుకువెళ్లనని చెప్పాడు. ఏర్ పోర్ట్ కు చేరుకున్న తరువాతనే, ఫైనల్ మొత్తాన్ని ధృవీకరించుకున్న తరువాతనే పే చేస్తానని పూజ గట్టిగా చెప్పారు.

బూతులు తిడుతూ..

దాంతో, ఆ డ్రైవర్ కోపంగా బూతులు తిట్టడం ప్రారంభించాడు. డబ్బులు ముందుగానే చెల్లించాలని బలవంతం చేశాడు. కాసేపు వాగ్వాదం జరిగిన తరువాత, పూజను కొట్టడానికిి ఆ డ్రైవర్ చేయెత్తాడు. కొడ్తానని గట్టిగా బెదిరించాడు. ‘‘డ్రైవర్ మరింత దూకుడుగా మారాడు. హర్యాన్వీ భాషలో మాట్లాడుతూ బెదిరించాడు. రాత్రికి మీ ఇంటికి వచ్చి ఏమి చేస్తానో చూడు’ అంటూ బెదిరించాడు.

వేరే క్యాబ్ బుక్ చేసుకుని..

అలా చాలాసేపు అతడు అరుస్తూనే ఉన్నాడు. ఆమె అనుమతి లేకుండా వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. చివరకు పూజ మరో క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్టుకు వెళ్లారు. తనను మధ్యలోనే ఎక్కించుకుని విమానం ఎక్కేందుకు సకాలంలో ఎయిర్ పోర్టుకు డ్రాప్ చేసినందుకు రెండో డ్రైవర్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. రెండో డ్రైవర్ ప్రవర్తనకు ప్రతిఫలంగా అతడికి కాస్త అదనంగా చెల్లించానని తెలిపింది.

చర్యలు తీసుకుంటాను

తనను ఇబ్బంది పెట్టిన ఓలా (ola) డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పూజా తెలిపారు. ఈ వివరాలను ఆమె లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు భారీగా స్పందించారు. "ఇది చాలా ఆందోళనకరం! ఈ మధ్య ఓలాతో నేను కూడా సమస్యలు ఎదుర్కొన్నాను. వారి కొత్త "పాపులర్ ఫేర్" విధానం కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి’’ అని ఒక యూజర్ స్పందించారు. దేశమంతా మహిళల భద్రత కోసం ఆందోళన చేస్తుంటే మరోవైపు, మహిళలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని సాక్షి సక్సేనా అనే మరో యూజర్ స్పందించారు. దీనిపై ఓలా ఇంతవరకు స్పందించలేదు.