IDBI ESO Recruitment 2024: ఐడీబీఐ లో 1000 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; అర్హత ఎనీ డిగ్రీ-idbi eso recruitment 2024 apply for 1000 executive posts direct link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Idbi Eso Recruitment 2024: ఐడీబీఐ లో 1000 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; అర్హత ఎనీ డిగ్రీ

IDBI ESO Recruitment 2024: ఐడీబీఐ లో 1000 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్; అర్హత ఎనీ డిగ్రీ

Sudarshan V HT Telugu
Nov 07, 2024 07:03 PM IST

IDBI ESO Recruitment 2024: ఐడీబీఐ లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఐడీబీఐ లో వెయ్యి ఈఎస్ఓ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ idbibank.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐడీబీఐ లో రిక్రూట్మెంట్
ఐడీబీఐ లో రిక్రూట్మెంట్

IDBI ESO Recruitment 2024: ఐడీబీఐ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ - సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) పోస్టుల భర్తీకి నోటిషికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ idbibank.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1000 పోస్టులను భర్తీ చేయనున్నారు.

లాస్ట్ డేట్

ఐడీబీఐ బ్యాంక్ (IDBI) లో ఎగ్జిక్యూటివ్ - సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ESO) పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 7న ప్రారంభమై 2024 నవంబర్ 16న ముగుస్తుంది. ఆన్లైన్ పరీక్ష డిసెంబర్ 1, 2024 న జరుగుతుంది.

రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు

  • యూఆర్: 448 పోస్టులు
  • ఎస్టీ: 94 పోస్టులు
  • ఎస్సీ: 127 పోస్టులు
  • ఓబీసీ: 231 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్: 100 పోస్టులు
  • పీడబ్ల్యూబీడీ: 40 పోస్టులు

అర్హతలు

ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వం/ ప్రభుత్వ సంస్థలు అంటే ఏఐసీటీఈ, యూజీసీ మొదలైన వాటి ద్వారా గుర్తింపు పొందిన/ ఆమోదించిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి అక్టోబర్ 2, 1999 - అక్టోబర్ 1, 2004 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).

ఎంపిక విధానం

సెలక్షన్ ప్రధానంగా ఆన్ లైన్ టెస్ట్ ద్వారా జరుగుతుంది. ఆ తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ (డీవీ), పర్సనల్ ఇంటర్వ్యూ (పీఐ), ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ (PRMT) ల అనంతరం తుది ఫలితాలను వెల్లడిస్తారు. ఆన్లైన్ పరీక్షలో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్/ కంప్యూటర్/ ఐటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు ఉంటుంది. అభ్యర్థి తప్పు సమాధానం ఇస్తే ప్రతి ప్రశ్నకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు లేదా 0.25 కోత విధిస్తారు.

దరఖాస్తు ఫీజు

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250, ఇతర అభ్యర్థులకు రూ.1050 (అప్లికేషన్ ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు) దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. డెబిట్ కార్డులు (రూపే/వీసా/మాస్టర్ కార్డ్/మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/మొబైల్ వ్యాలెట్ల ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు.

Whats_app_banner