Agniveer Selection: అగ్నివీరుల ఎంపిక ప్రక్రియ మారింది; మొదట ఆన్ లైన్ టెస్ట్-common entrance exam now first stage of agniveer selection from this year ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Agniveer Selection: అగ్నివీరుల ఎంపిక ప్రక్రియ మారింది; మొదట ఆన్ లైన్ టెస్ట్

Agniveer Selection: అగ్నివీరుల ఎంపిక ప్రక్రియ మారింది; మొదట ఆన్ లైన్ టెస్ట్

HT Telugu Desk HT Telugu
Mar 01, 2023 02:54 PM IST

Agniveer Selection: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సాయుధ దళాల భర్తీ కార్యక్రమం ‘అగ్నిపథ్’కు సంబంధించి కీలక మార్పులు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Agniveer Selection: 2023- 2024 సంవత్సరానికి గానూ అగ్నివీరుల భర్తీ (Agniveer Selection) వివరాలను సికిందరాబాద్ లోని ఆర్మీ రిక్రూట్ మెంట్ కార్యాలయంలో డైరెక్టర్ గా విధుల్లో ఉన్న కల్నల్ కీట్స్ కే దాస్ వెల్లడించారు.

Agniveer Selection in 3 stages: మూడు దశల్లో..

కల్నల్ కీట్స్ కే దాస్ వెల్లడించిన వివరాల మేరకు.. 2023- 2024 సంవత్సరానికి గానూ అగ్నివీరుల ఎంపిక (Agniveer Selection) మూడు దశల్లో జరుగుతుంది. మొదట కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (Common Entrance Exam CEE) ఉంటుంది. ఇది ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ (Army Recruitment Rally) కన్నా ముందే ఉంటుందన్న విషయం అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

common entrance exam: మొదట కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్

గతంలో Agniveer Selection లో మొదట రిక్రూట్ మెంట్ ర్యాలీ (Recruitment Rally) ఉండేది. ఆ తరువాత ఫిజికల్, మెడికల్ టెస్ట్స్ ఉండేవి. వీటిలో అర్హత సాధించిన వారు మాత్రమే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (Common Entrance Exam CEE) రాయడానికి వీలు ఉండేది. తాజాగా, ఈ పద్ధతిని మార్చారు. ఇప్పుడు మొదట ఆన్ లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (Common Entrance Exam CEE) ను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఫిజికల్ కు వెళ్లాల్సి ఉంటుంది. వారిని మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీకి (Recruitment Rally) అనుమతిస్తారు. ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలో మొదటి దశ ఆన్ లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాగా, రెండో దశ రిక్రూట్మెంట్ ర్యాలీ. ఈ రెండో దశలో ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్ మెంట్ టెస్ట్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారు మూడో దశ అయిన మెడికల్ టెస్ట్ కు వెళ్లాల్సి ఉంటుంది. మొదటి రెండు దశల్లో సాధించిన ఉత్తీర్ణత ఆధారంగా మెరిట్ లిస్ట్ ను రూపొందిస్తారు.

Registration started: రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది..

అగ్నివీర్ సెలెక్షన్ (Agniveer Selection) కు సంబంధించిన రిక్రూట్ మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 16న ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ మార్చి 15. ఆన్ లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ నెలలో ఉంటుంది. తెలంగాణలో నాలుగు సెంటర్లలో ఈ కంప్యూటర్ బేస్డ్ పరీక్ష జరుగుతుంది. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఈ సెంటర్ల సంఖ్యను పెంచే విషయం ఆలోచిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ల్లో ఈ ఆన్ లైన్ పరీక్షను నిర్వహిస్తారు.

Bonus marks to ITI, Polytechnic: బోనస్ మార్కులు కూడా..

తెలంగాణలో ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి నిర్వహించే రిక్రూట్ మెంట్ ర్యాలీ (Recruitment Rally) కి సంబంధించిన తేదీని ఇంకా నిర్ణయించలేదు. తెలంగాణ నుంచి గత సంవత్సరం మొత్తం 808 అగ్నివీరులు సెలెక్ట్ అయ్యారని కల్నల్ కీట్స్ కే దాస్ వెల్లడించారు. ఆన్ లైన్ పరీక్షకు సంబంధించి సిలబస్ లో కానీ, పరీక్ష పేపర్ విధానంలో కానీ ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. ఐటీఐ (ITI), పాలిటెక్నిక్ (polytechnic) పూర్తి చేసిన అభ్యర్థులకు బోనస్ మార్కులు కూడా ఉంటాయని వెల్లడించారు.

Whats_app_banner