Stocks to buy today : ఐటీసీ స్టాక్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రేజ్​ టార్గెట్​ ఇదే..-stocks to buy today 4th november 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఐటీసీ స్టాక్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రేజ్​ టార్గెట్​ ఇదే..

Stocks to buy today : ఐటీసీ స్టాక్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రేజ్​ టార్గెట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu
Nov 04, 2024 08:16 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

దీపావళి సందర్భంగా నిర్వహించిన ముహురత్​ ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభపడ్డాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 335 పాయింట్లు పెరిగి 79,724 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 99 పాయింట్లు పెరిగి 24,304 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 199 పాయింట్ల పెరిగితో 51,674 వద్దకు చేరింది.

“24,000-24,500 శ్రేణిలో కన్సాలిడేట్ అవుతూనే ఉంది. ఇరువైపులా బ్రేకౌట్​ తదుపరి దిశను నిర్ణయిస్తుంది. 24,500 మార్కును దాటితే ఇండెక్స్ టార్గెట్ 24,800 మార్కును దాటవచ్చు,” అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం 1 గంట ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 211.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 377.33 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.6శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.41శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.8శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

జొమాటో- బై రూ. 248.99, స్టాప్​ లాస్​ రూ. 240, టార్గెట్​ రూ. 265

యూటీఐ అసెట్​ మేనేజ్​మెంట్​ కంపెనీ- బై రూ. 1360.44, స్టాప్​ లాస్​ రూ. 1322, టార్గెట్​ రూ. 1444

గ్రాసిమ్​ ఇండస్ట్రీస్​- బై రూ. 2702, స్టాప్​ లాస్​ రూ. 2650, టార్గెట్​ రూ. 2850

ఎల్​ఐసీ హౌసింగ్​- బై రూ. 632, స్టాప్​ లాస్​ రూ. 605, టార్గెట్​ రూ. 660

ఐటీసీ- బై రూ. 489, స్టాప్​ లాస్​ రూ. 480, టార్గెట్​ రూ. 503.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

పాలీ మెడిక్యూర్: రూ.3151 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.3370, స్టాప్ లాస్ రూ.3040;

కేజేఎంసీ కార్పొరేట్ అడ్వైజర్స్: రూ.105.15 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.114, స్టాప్ లాస్ రూ.101;

బీఏఎస్ఎఫ్ ఇండియా: రూ.8314 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.8900, స్టాప్ లాస్ రూ.8000;

డీసీడబ్ల్యూ: రూ .107.20 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ .113, స్టాప్ లాస్ రూ .103;

టీటీఎల్: రూ .160.35 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ .172, స్టాప్ లాస్ రూ .155.

Whats_app_banner

సంబంధిత కథనం