Arpita Mukherjee : ఆ నాలుగు వాహనాలు మిస్సింగ్​..! ఒక్కో కారులో భారీగా డబ్బులు?-hunt for 4 cash filled cars of sacked bengal minister partha chatterjee aide arpita mukherjee ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arpita Mukherjee : ఆ నాలుగు వాహనాలు మిస్సింగ్​..! ఒక్కో కారులో భారీగా డబ్బులు?

Arpita Mukherjee : ఆ నాలుగు వాహనాలు మిస్సింగ్​..! ఒక్కో కారులో భారీగా డబ్బులు?

Sharath Chitturi HT Telugu
Jul 29, 2022 01:56 PM IST

Arpita Mukherjee : స్కూల్​ జాబ్​ స్కామ్​లో రోజుకో విషయం, రూ. కోట్లల్లో డబ్బులు బయటపడుతున్నాయి. తాజాగా.. అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు కార్ల కోసం ఈఢీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒక్కో కారులో భారీగా నగదు ఉంటుందని భావిస్తున్నారు.

అర్పిత ముఖర్జీ
అర్పిత ముఖర్జీ (HT_PRINT)

Arpita Mukherjee : పశ్చిమ్​ బెంగాల్​లో పార్థ ఛటర్జీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసం నుంచి ఇప్పటికే రూ. కోట్లల్లో నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక ఇప్పుడు.. అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు వాహనాలను ఈడీ వెతుకుతోందని సమాచారం.

అర్పిత దగ్గర ఆడీ ఏ4, హోండా సిటీ, హోండా సీఆర్​వీ, మెర్సిడీస్​ బెంజ్​ వాహనాలు ఉన్నట్టు.. వాటిల్లో భారీగా నోట్ల కట్టలు ఉన్నట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అవి కనిపించడం లేదు. వాటిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అర్పిత నివాసం నుంచి ఇప్పటికే రూ. 50కోట్ల కన్నా ఎక్కువ నగదు బయటపడింది. ఇక ఆ వాహనాల్లో నగదు ఎంత ఉంటుందనే విషయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి.

అర్పితను అరెస్ట్​ చేసే సమయంలో తెలుపు రంగు మెర్సిడీస్​ వాహనాన్ని ఈడీ అధికారులు జప్తు చేశారు. అంతేకాకుండా.. ఆమె ఇంట్లో 'పీ' అక్షరం ఉన్న డైమండ్​ రింగ్​ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Partha chatterjee : 30ఏళ్ల అర్పిత ముఖర్జీ.. ఓ నటి, మోడల్​, ఇన్​స్టాగ్రామర్​. 2008-14 మధ్య సినిమల్లో కనిపించారు. కాగా.. ఆమెకు ఎన్నో ఆస్థులు ఉన్నాయి. ఖరీదైన ఫ్లాట్​లు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం.. స్కూల్​ జాబ్స్​ స్కామ్​పై దర్యాప్తులో భాగంగా.. ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్​ చేశారు. అదే స్కామ్​లో మనీలాండరింగ్​ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ఈడీ.. టీఎంసీ నేత, రాష్ట్రమంత్రి పార్థ ఛటర్జీని సైతం అరెస్ట్​ చేసింది. ఆ తర్వాత.. ఆయన పార్టీ పదవులతో పాటు ఇతర హోదాలను కోల్పోయారు.

School jobs scam : ఈడీ అధికారుల ప్రకారం.. అర్పిత ముఖర్జీకి.. కోల్​కతాలోని క్లబ్​టౌన్​ హైట్స్​లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. వీటిల్లోని ఒకదానిలో గురువారం సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు.. అక్కడ రూ. 30కోట్లు వెలుగులోకి వచ్చాయి. ఐదు కేజీల బంగారం ఆభరణాలను సైతం అధికారులు జప్తు చేశారు. రెండో ఫ్లాట్​లో అధికారులు ఇంకా సోదాలు నిర్వహించలేదు.

కాగా.. ముఖర్జీకి కోల్​కతాలోని డైమండ్​ సిటీ కాండోలో ఉన్న మరో ఫ్లాట్​లో ఈడీ అధికారులు శుక్రవారం రైడ్​ చేశారు. రూ. 21కోట్ల నగదు, రూ. 2కోట్లు విలువ చేసే గోల్డ్​ బార్లు, విదేశీ కరెన్సీని జప్తు చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం