ITR refund : ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా? కారణం ఇదే..!
ITR refund awaited : ఐటీఆర్ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మీకు ఇంకా రీఫండ్ రాకపోవడానికి గల కారణాలను ఇక్కడ తెలుసుకోండి.
ITR refund awaited : ఐటీఆర్ ఫైల్ చేసి నెలలు గడిచినా.. రీఫండ్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారా? మీకు రీఫండ్ పడకపోవడానికి పలు కారణాలు ఉండొచ్చు. అవేంటంటే..
ఐటీఆర్ రీఫండ్‌కి మీరు అర్హులేనా?
ముందుగా.. ఐటీఆర్ రీఫండ్‌కి మీరు అర్హులేనా అన్న విషయం తెలుసుకోవాలి. అందుకోసం మీ ఐటీఆర్‌ని ఆదాయపు పన్నుశాఖ ప్రాసెస్ చేసిందా లేదా చూడాలి. రీఫండ్‌కి మీరు అర్హులు అని ఐటీశాఖ ధ్రువీకరిస్తేనే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులుపడతాయి.
ఐటీఆర్ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోండి..
ఎన్ఎస్డీఎల్, ఆదాయపు పన్నుశాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా మీ ఐటీఆర్ రీఫండ్ స్టేటస్‌ని చెక్ చేసుకోవాలి. 'నో రికార్డ్స్ రీఫండ్' అని చూపిస్తుంటే.. ఆదాయాపు పన్నుశాఖ సంబంధిత వివరాలను ఇంకా పెట్టలేదని అర్థం.
ఐటీఆర్ రీఫండ్ రాకపోవడానికి మూడో కారణం..
రీఫండ్ ఇష్యూ చేసినట్టు, మోడ్ ఆఫ్ పేమెంట్, అమోంట్, డేట్ ఆఫ్ క్లియరెన్స్ ఆఫ్ ఫండ్ వంటి వివరాలు ఐటీఆర్ స్టేటస్‌లో కనిపిస్తాయి. వాటిని చూడాలి.
ITR refund status check : ఇంకొన్ని సందర్భాల్లో 'రీఫండ్ ఫెయిల్డ్' అని కనిపిస్తుంది. అందుకు తగ్గ కారణాలను కూడా వెల్లడిస్తారు. మీ మెయిల్‌కి కూడా ఈ మెయిల్ వస్తుంది. ఐటీఆర్ రీఫండ్ ఫెయిల్ అయితే.. రీ- ఇష్యూ కోసం ఐటీశాఖకు మీరు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్ కూడా ఈఫైలింగ్ పోర్ట్‌లో అందుబాటులో ఉంటుంది.
ఇంకోసారి 'రీఫండ్ కెప్ట్ ఆన్ హోల్డ్' అని కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు మీ మెయిల్ ఐడీకి వస్తాయి. బ్యాంకు ఖాతా వాలిడేట్ చేసే సమయంలో లోపాలు ఉండొచ్చు.. లేదా బ్యాంకు ఖాతాకు పాన్ లింక్ అయ్యి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఐటీఆర్ రీఫండ్ ఆలస్యమవుతుంది.
గత ఆర్థిక సంవత్సరాల్లో 'ఔట్‌స్టాండింగ్ డిమాండ్' పెండింగ్‌లో ఉంటే మీకు రీఫండ్ రాకపోవచ్చు. ఈ మేరకు మీకు సెక్షన్ 143(1) కింద సమాచారం అందుతుంది.
ఐటీఆర్ రీఫండ్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం