Google search : మరింత మెరుగ్గా ‘గూగుల్​ సెర్చ్ రిజల్ట్స్​’-​ ఆ కంటెంట్​కు చెక్​!-google to reduce low quality unoriginal content in google search results ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Google Search : మరింత మెరుగ్గా ‘గూగుల్​ సెర్చ్ రిజల్ట్స్​’-​ ఆ కంటెంట్​కు చెక్​!

Google search : మరింత మెరుగ్గా ‘గూగుల్​ సెర్చ్ రిజల్ట్స్​’-​ ఆ కంటెంట్​కు చెక్​!

Sharath Chitturi HT Telugu
Aug 19, 2022 12:31 PM IST

Google search results : గూగుల్​ సెర్చ్​ రిజల్ట్స్​కు కొత్త అప్డేట్​ తీసుకొస్తోంది ఆ సంస్థ. ఫలితంగా తక్కువ నాణ్యత, ఒరిజినల్​ కాని కంటెంట్​లు సెర్చ్​ రిజల్ట్స్​లో కనిపించడం తగ్గుతాయని గూగుల్​ చెబుతోంది.

<p>మరింత మెరుగ్గా ‘గూగుల్​ సెర్చ్ రిజల్ట్స్​’-​ ఆ కంటెంట్​కు చెక్​!</p>
మరింత మెరుగ్గా ‘గూగుల్​ సెర్చ్ రిజల్ట్స్​’-​ ఆ కంటెంట్​కు చెక్​! (REUTERS)

Google search results : ఈ టెక్​ కాలంలో గూగుల్​ సెర్చ్​ లేనిదే మనిషికి రోజు గడవడం లేదు! విషయం పెద్దదైనా, చిన్నదైనా.. మనికి సమాచారం కావాలంటే.. బ్రౌజర్​లో గూగుల్​ సెర్చ్​ చేయాల్సిందే కదా. అయితే.. గూగుల్​ సెర్చ్​ రిజల్ట్స్​లో.. మనకి అవసరమైన కంటెంట్​తో పాటు అవసరం లేనివి కూడా చాలా వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి అవే తొలుత కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్ల సమాచార సేకరణలో ఆలస్యం అవుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది గూగుల్​. గూగుల్​ సెర్చ్​ రిజల్ట్స్​లో తక్కువ నాణ్యతో కూడిన అంశాలను తొలగించి, ఒరిజినల్​ కంటెంట్​నే యూజర్లకు అందించేందుకు ప్లాన్​ చేస్తోంది.

ఇందుకోసం 'హెల్ప్​ఫుల్​ కంటెంట్​ అప్డేట్​' పేరుతో కొత్త సెర్చ్​ ర్యాంకింగ్​ అప్డేట్​ని.. ఈ నెల 22న లాంచ్​ చేయనుంది గూగుల్​. ప్రపంచవ్యాప్తంగా ఇది ఇంగ్లీష్​లో అందుబాటులోకి రానుంది.

"సమాచారం కోసం కాకుండా.. కేవలం క్లిక్స్​ కోసమే ఉండే లింక్​లను చూసి యూజర్లు అసంతృప్తి చెందుతారని మాకు తెలుసు. అందువల్ల.. గూగుల్​ సెర్చ్​ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాము. వచ్చే వారం నుంచి ఇది ఇంగ్లీష్​లో అందుబాటులో ఉంటుంది. కొత్త అప్డేట్​ ద్వారా ప్రజల కోసం, ప్రజలకు ఉపయోగపడే కంటెంట్​ను సులభంగా యాక్సిస్​ చేయవచ్చు," అని గూగుల్​ ప్రతినిధి వెల్లడించారు.

Changes to google search results : గూగుల్​లో కనిపించే వాటికి ర్యాంకింగ్స్​ ఉంటాయి. ఒక లింక్​కు ఎంత ఎక్కువ క్లిక్స్​ లభిస్తే.. అది గూగుల్​ సెర్చ్​లో అంత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే.. వీటిల్లో ఒరిజినల్​ కానివి, క్లిక్​ బైట్స్​, తక్కువ నాణ్యతతో కూడిన కంటెంట్​ కూడా గూగుల్​ సెర్చ్​లో పైకి వస్తున్నాయి. వీటిని తగ్గించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తోంది గూగుల్​. 

తాజాగా.. ఆన్​లైన ఎడ్జ్యూకేషన్​ మెటీరియల్​, షాపింగ్​, టెక్​ కంటెంట్​కి ఈ అప్టేడ్​ ఉపయోగపడుతుంది!

"ఉదాహరణకు మీరు.. ఒక కొత్త సినిమాపై సమాచారం కోసం గూగుల్​ సెర్చ్​ చేశారు. ఇకపై గూగుల్​లో ప్రత్యేకమైన, కచ్చితత్వంతో కూడిన సమాచారం లభిస్తుంది. అవి మీకు ఉపయోగపడతాయి. మా సిస్టమ్స్​ని ఎప్పటికప్పుడు రిఫైన్​ చేస్తున్నాము. రానున్న వారాల్లో.. యూజర్లకు ఉపయోగపడే మరెన్నో అప్డేట్స్​ని తీసుకొస్తాము," అని గూగుల్​ వెల్లడించింది.

Whats_app_banner

సంబంధిత కథనం