Google: గూగుల్ సెర్చ్ లో కొత్త ఫీచర్; భారతీయులకు ప్రత్యేకంగా కృత్రిమ మేథ ఆధారిత సెర్చ్ ఇంజన్; హిందీలో కూడా..
Google: భారతీయులకు ఉపయోగపడే కృత్రిమ మేథ (artificial intelligence AI) ఆధారిత సెర్చ్ ఫీచర్ ని గూగుల్ లేటెస్ట్ గా ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ద్వారా భారతీయులు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సెర్చ్ ఆప్షన్స్ పొందవచ్చు. ఈ భాషల్లో సెర్చ్ వాయిస్ కమాండ్స్ పంపవచ్చు. అలాగే రిజల్ట్స్ ని కూడా స్పీచ్ రూపంలో వినవచ్చు
Google: భారతీయులకు ఉపయోగపడే కృత్రిమ మేథ (artificial intelligence AI) ఆధారిత సెర్చ్ ఫీచర్ ని గూగుల్ లేటెస్ట్ గా ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ద్వారా భారతీయులు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సెర్చ్ ఆప్షన్స్ పొందవచ్చు. ఈ భాషల్లో సెర్చ్ వాయిస్ కమాండ్స్ పంపవచ్చు. అలాగే రిజల్ట్స్ ని కూడా స్పీచ్ రూపంలో వినవచ్చు
సెర్చ్ జనరేటివ్ ఎక్స్పీరియన్స్ - ఎస్జీఈ
ఈ సరికొత్త ఫీచర్ భారతీయులకు ఉపయోగపడే కృత్రిమ మేథ (AI) ఆధారిత ఫీచర్ అని గూగుల్ గురువారం వెల్లడించింది. ఈ ఏఐ ఆధారిత సెర్చ్ కి ‘‘సెర్చ్ జనరేటివ్ ఎక్స్పీరియన్స్ (Search Generative Experience (SGE)’’ అని గూగుల్ పేరు పెట్టింది. భారతీయులకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గూగుల్ తెలిపింది. ఎస్జీఈ ని గూగుల్ ఇప్పటికే వివిధ దేశాలలో అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ భారత్ లో ఇండియా స్పెసిఫిక్ అవసరాలు నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ ఎస్జీఈ ని రూపొందించింది. సాధారణ సెర్చ్ ఇంజన్ కన్నా ఇది మరింత వేగంగా, మరింత నిర్దిష్టంగా సమాచారాన్ని అందిస్తుంది. అదనంగా హిందీ భాషలో కూడా సమాచారాన్ని టెక్స్ట్ లేదా స్పీచ్ రూపంలో పొందవచ్చు.
పైలట్ ప్రాజెక్టుగా
ఈ కృత్రిమ మేథ ఆధారిత సెర్చ్ ఇంజన్ - ఎస్జీఈ అత్యంత అరుదైన ప్రశ్నలకు కూడా సమాధానాన్ని ఇవ్వగలదని గూగుల్ తెలిపింది. సమాధానాలను కూడా యూజర్ కు ఉపయోగపడే విధంగా ఒక ఆర్డర్లో అందిస్తుందని తెలిపింది. ప్రస్తుతానికి ఈ సేవ ఎంపిక చేసిన కొందరు వినియోగదారులకు మాత్రమే, పైలట్ ప్రాజెక్టుగా అందిస్తున్నట్లు తెలిపింది. త్వరలో యూజర్లు అందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది. ఈ ఆప్షన్ గూగుల్ హోం పేజీలో సాధారణ సెర్చ్ బార్ లా కాకుండా, చాటా బాట్ (chatbot) తరహాలో ఉంటుందని వివరించింది. ఈ ఎస్జీఈ తో సెర్చ్ ఇంజన్ పనితీరులో సమూల మార్పులు వస్తాయని గూగుల్ పేర్కొంది. అత్యంత అరుదైన, ఎవరూ ఊహించని ప్రశ్నలకు కూడా ఈ ఎస్జీఈ సమాధానం ఇవ్వగలదని వివరించింది.