GE layoffs: మళ్లీ లే ఆఫ్స్ ప్రారంభం; జీఈ లో 1000 ఉద్యోగాలు కోత; ఇండియన్స్ పై ప్రభావం-ge layoffs 1 000 jobs to be cut in lm wind power indians may be hit as well ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ge Layoffs: మళ్లీ లే ఆఫ్స్ ప్రారంభం; జీఈ లో 1000 ఉద్యోగాలు కోత; ఇండియన్స్ పై ప్రభావం

GE layoffs: మళ్లీ లే ఆఫ్స్ ప్రారంభం; జీఈ లో 1000 ఉద్యోగాలు కోత; ఇండియన్స్ పై ప్రభావం

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 01:14 PM IST

GE layoffs: ప్రముఖ అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాల కోతను కొనసాగిస్తున్నాయి. నిర్వహణ ఖర్చుల తగ్గింపు ప్రధాన లక్ష్యంగా పలు టెక్ కంపెనీలు ఇప్పటికే లే ఆఫ్స్ ప్రకటించాయి. ఇప్పుడు తాజాగా జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ దాదాపు వెయ్యి ఉద్యోగాలను తొలగించబోతున్నట్లు వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

GE layoffs: జనరల్ ఎలక్ట్రిక్ (GE) 1,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. ఈ చర్య భారతీయ సిబ్బందిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. జీఈ రెన్యూవబుల్ ఎనర్జీకి చెందిన ఎల్ఎం విండ్ పవర్ (LM Wind Power) బిజినెస్ సీఈఓ ఒలివర్ ఫాంటన్ ఉద్యోగులతో మాట్లాడుతూ రాబోయే నెలల్లో ఉద్యోగుల తొలగింపు (Layoffs) ఉండబోతోందన్నారు. ఎల్ఎం విండ్ పవర్ బిజినెస్ నుంచి రాబోయే వారాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రారంభం కావచ్చు. మార్కెట్ సవాళ్ల కారణంగా, లే ఆఫ్స్ తప్పడం లేదని ఒలివర్ ఫాంటన్ ఉద్యోగులకు తెలిపారు. డెన్మార్క్ కు చెందిన ఎల్ఎం విండ్ పవర్ ను జీఈ (GE) 2017లో 1.65 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. విండ్ టర్బైన్ల కోసం రోటార్ బ్లేడ్లను తయారు చేసే ఈ కంపెనీ జీఈ వెర్నోవాలో భాగంగా ఉంది.

భారత్ లో ఉద్యోగాల కోత

ఎల్ఎం విండ్ పవర్ (LM Wind Power) లే ఆఫ్స్ (Layoffs) ప్రభావం భారతీయ ఉద్యోగులపై కూడా ఉండనుందని తెలుస్తోంది. జీఈ నుంచి ప్రపంచవ్యాప్తంగా, 1000 ఉద్యోగాల తొలగింపు ఉండబోతోందని సమాచారం. ఈ మేరకు మార్చి 26న కంపెనీ తన ఉద్యోగులకు ఒక ఇమెయిల్ పంపించింది. డెన్మార్క్, స్పెయిన్, పోలాండ్, కెనడా, చైనా, ఇండియా, బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్ సహా మరెన్నో దేశాలలో జీఈ ఉనికిని కలిగి ఉంది. 2007లో భారత్ లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థలో 200 మందికి పైగా ఇంజినీర్లు ఉన్నారు.

Whats_app_banner