Terrorist attack : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి!
Jammu Kashmir terrorist attack : జమ్ముకశ్మీర్ రాజౌరీలో ఉగ్రవాదుల ఆకస్మిక దాడిలో మరణించిన జవాన్ల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రస్తుతం ఆ ప్రాంతం.. ఆర్మీ ఆధీనంలో ఉంది.
Jammu Kashmir terrorist attack : జమ్ముకశ్మీర్‌లో గురువారం ఉగ్రదాడి జరిగింది. భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య భీకర పోరు జరగ్గా.. నలుగురు జవాన్లు మరణించారు.
ఆకస్మిక దాడి..
జమ్ముకశ్మీర్ రాజౌరీ ప్రాంతంలోని డేరా కి గాలి అనే ప్రాంతం నుంచి సైనికులతో కూడిన రెండు వాహనాలు వెళుతుండగా.. గురువారం మధ్యాహ్నం 3: 45 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది! ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. వెంటనే తేరుకున్న సైనికులు ప్రతిఘటించారు. ఫలితంగా గన్ ఫైట్ మొదలైంది. ఈ క్రమంలో నలుగురు జవాన్లు వీర మరణం పొందినట్టు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది.
Rajouri attack news today : చివరి సమాచారం ప్రకారం.. సోమవారం రాత్రి వరకు ఇరువర్గాల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. మరోవైపు.. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిర్బంధ తనిఖీలతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టాయి.
"ఆ ప్రాంతంలో బుధవారం సాయంత్రం నుంచే మేము ఆపరేషన్‌లో ఉన్నాము. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ చేపట్టాము. గురువారం.. ముష్కరులతో కాంటాక్ట్ అయ్యింది. ఎన్కౌంటర్ సంభవించింది," అని ఆర్మీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
గత నెలలో..!
Rajouri attack martyrs : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నట్టు కనిపిస్తోంది! గత నెలలో.. రాజౌరీలోని కలకోట్ ప్రాంతంలో ఆర్మీ చేపట్టిన యాంటీ టెరర్ర్ ఆపరేషన్‌లో ఇద్దరు కెప్టెన్లు సహా ఐదుగురు సైనికులు ప్రాణాలు విడిచారు.
రాజౌరీలో గత కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నట్టు తెలుస్తోంది. వారిని అడ్డుకునేందుకు భద్రతా దళాలు భారీ ఎత్తున చర్యలు చేపడుతున్నాయి.
Jammu Kashmir terror attack death toll : ఈ ఏడాది ఏప్రిల్- మేలో రాజౌరీ- పూంచ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 10మంది సైనికులు మరణించారు. వాస్తవానికి ఇక్కడ 2003-2021 వరకు ఉగ్రవాదుల కార్యకలాపాలు పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత ముష్కరులు మళ్లీ యాక్టివ్ అయ్యారు!
మొత్తం మీద గత రెండేళ్లల్లో జరిగిన యాంటీ- టెర్రర్ ఆపరేషన్స్‌లో 35కుపైగా మంది సైనికులు ప్రాణాలు విడిచారు.
సంబంధిత కథనం