Mumbai terror attack : 26/11 ఉగ్రదాడికి 15ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగిందంటే..!
Mumbai terror attack : ముంబై ఉగ్రదాడులకు 15ఏళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో.. నాడు జరిగిన ఘట్టాలపై ప్రత్యేక కథనం..
Mumbai terror attack : 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు నేటితో 15ఏళ్లు పూర్తయ్యాయి. నాటి చీకటి రోజును భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. సాధారణ పౌరులపై ఉగ్రవాదులు రెచ్చిపోయిన తీరు, అందరిని భయపెట్టింది. ప్రాణాలకు తెగించిన సైన్యం, ఉగ్రవాదులపై వీరోచితంగా పోరాడిన విధానం.. అందరిలో స్ఫూర్తి నింపింది. 15ఏళ్లు పూర్తైన తరుణంలో.. నాటి ఘట్టాలను ఒక్కొక్కటిగా గుర్తుతెచ్చుకుందాము..
ఇదీ జరిగింది..
నవంబర్ 21, సాయంత్రం:- కరాచీ నుంచి 10 మంది ఉగ్రవాదులు బోర్డులో బయలుదేరారు. ఇండియన్ నేవీకి కనిపించకుండా 38 గంటల పాటు ప్రయాణం సాగించారు.
నవంబర్ 22:- 10 మంది ఉగ్రవాదులకు క్రెడిట్ కార్డ్‌లు, డ్రై ఫ్రూట్స్ ఆయుధాలు అందాయి. ఆయుధాల్లో.. ఏకే-47 రైఫిల్, హ్యాండ్ గ్రెనైడ్స్, మ్యాగజైన్స్ ఉన్నాయి.
నవంబర్ 23:- మత్స్యకారుల బోటును ఉగ్రవాదులు హైజాక్ చేశారు. నలుగురిని చంపేశారు. బోటు కెప్టెన్‌తో కలిసి ఇండియావైపు బయలుదేరారు.
26/11 Mumbai terror attacks : నవంబర్ 26:- ముంబైకి 7 కి.మీల దూరంలో ఉండగా.. బోటు కెప్టెన్‌ని ఉగ్రవాదులు చంపేశారు. అక్కడి నుంచి 3 స్పీడ్‌బోట్స్ ద్వారా కోలాబా జెట్టీవైపు వెళ్లారు. రాత్రి 8 గంటల 10 నిమిషాలు.. బోట్స్‌ని ముంబై కుఫ్పె పెరేడ్‌కు సమీపంలోని మాచిమార్ నగర్లో కొంతసేపు ఆపారు. ఆరుగురు ఉగ్రవాదులు అక్కడ కిందకి దిగారు. స్థానికులు ప్రశ్నించగా.. తాము విద్యార్థులని అబద్ధం చెప్పారు. మిగిలిన వారు బోట్స్‌లో వెళ్లిపోయారు.
రాత్రి 8 గంటల 30 నిమిషాలకు.. మిగిలిన బోట్స్ కొలాబా కుఫె పరేడ్‌కు సమీపంలోని బాద్వార్ పార్క్‌లో ఆగాయి. ఉగ్రవాదులు కిందకి దిగారు. అక్కడే ఉన్న మత్స్యకారులు ప్రశ్నించగా.. వారితో గొడవపడి, అక్కడి నుంచి వెళ్లారు.
Mumbai terror attack 2008 : కొద్దిసేపటికే.. లియోపోల్డ్ కేఫ్ వద్ద కాల్పులు శబ్ధం వినపడింది. 10మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. రెండు ట్యాక్సీల్లో బాంబులు పెట్టారు. ఐదుగురు మరణించారు. 15మంది గాయపడ్డారు.
తాజ్ మహల్ హోటల్లోకి నలుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు. మరో ఇద్దరు ఒబెరాయ్ ట్రైడెంట్‌లోకి వెళ్లారు. మరో ఇద్దరు నారీమన్ హౌజ్‌లోకి దూసుకెళ్లారు. మరో ఇద్దరు.. ఛత్రపతీ శివాజి మహరాజ్ టర్మినస్ (సీఎస్ఎంటీ)కు ట్యాక్సీలో బయలుదేరి వెళ్లారు. వీరిలో అజ్మల్ కసబ్ ఒకడు.
రాత్రి 9 గంటల 20 నిమిషాలు.. సీఎస్ఎంటీలో కాల్పులకు తెగబడ్డారు ఇద్దరు ఉగ్రవాదులు. గ్రెనైడ్ దాడులు చేశారు. 58మంది మరణించారు. 104మంది గాయపడ్డారు.
26/11 terror attack : రాత్రం 10 గంటల 30 నిమిషాలకు.. ఇస్మాయెల్, కసబ్‌లు కామా హాస్పిటల్వైపు వెళ్లారు. వారిని ముందే గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది.. రోగులు ఉన్న గదులను లాక్ చేసేశారు. ఇక్కడ జరిగిన ఎన్కౌంటర్లో ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరేతో పాటు మరో ముగ్గురు అధికారులు మరణించారు. ఉగ్రవాదులు.. జీప్ దొంగలించారు. పోలీసులు ఆ జీప్ని పట్టుకుని కాల్పులు జరిపారు. ఇస్మాయెల్ మరణించాడు. కసబ్‌ని సజీవంగా పట్టుకున్నారు పోలీసులు.
నవంబర్ 28:- ఒబేరాయ్ హోటల్లో కమాండో ఆపరేషన్స్ పూర్తైంది. 24 మృతదేహలను రికవరీ చేశారు. 143 మంది బంధీలను విడిపించారు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
ఉదయం 7 గంటల 30 నిమిషాలకు ఎన్ఎస్జీ కమాడోలు నారీమన్ హౌజ్‌లోకి వెళ్లారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు గన్‌ఫైట్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హమతయ్యారు. ఆపరేషన్ ముగిసింది.
Mumbai terror attacks death toll : నవంబర్ 29:- ఉదయం 8 గంటలకు ముంబై తాజ్ హోటల్ని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించినట్టు సైన్యం ప్రకటించింది. ముంబై వీధుల్లో సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.
సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు.. తాజ్ మహల్ హోటల్.. పూర్తిగా ప్రభుత్వంలోకి వెళ్లింది.
సంబంధిత కథనం