Kashmir encounter: కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్; నలుగురు ఆర్మీ అధికారుల మృతి
Kashmir encounter: జమ్మూ కాశ్మీర్‌లోని ధర్మాల్‌లోని బాజిమాల్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులతో జరిగిన ఆ ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు మరణించగా, మరొకరు గాయపడ్డారు.
Kashmir encounter: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా ధర్మాల్‌లోని బాజిమాల్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.
ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు
కశ్మీర్ లోని రాజౌరి జిల్లాలో ఉన్న బజిమల్ అటవీ ప్రాంతం సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయిన జవాన్లలో ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు (army captain), ఒక హవల్దార్, మరొక జవాన్ ఉన్నారు. కార్డన్ అండ్ సెర్చ్ సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు అకస్మాత్తుగా భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. దాంతో, ఆర్మీ సిబ్బంది వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పులు కొన్ని గంటల పాటు కొనసాగాయి. భద్రతాదళాల కాల్పుల్లో ఆ టెర్రరిస్టులు కూడా హతమయ్యారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఒక ఏకే-47 రైఫిల్, మూడు మ్యాగజైన్లు, మూడు గ్రెనేడ్లు, ఒక పర్సు ను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో కూడా..
కొన్ని రోజుల క్రితమే రాజౌరి జిల్లాలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. సాధారణంగా శీతాకాలంలో కశ్మీర్లో ఉగ్రవాదుల కదలకలు పెరుగుతాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను అడ్డుపెట్టుకుని సరిహద్దు దాటి పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడే ప్రయత్నాలు చేస్తారు.