Bharat Ratna : మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు భారత రత్న-former prime minister pv narasimha rao garu is to be conferred with bharat ratna ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bharat Ratna : మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు భారత రత్న

Bharat Ratna : మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు భారత రత్న

Sharath Chitturi HT Telugu
Feb 09, 2024 01:22 PM IST

Bharat Ratna for PV Narasimha Rao : మాజీ ప్రధానికి భారత రత్నను ప్రకటించింది కేంద్రం. ఆయనతో పాటు మరో మాజీ ప్రధాని చరణ్​ సింగ్​, శాస్త్రవేత్త ఎంఎస్​ స్వామినాథన్​కి కూడా ఈ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది.

మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు భారత రత్న
మాజీ ప్రధాని పీవీ నరసింహ రావుకు భారత రత్న

Bharat Ratna for PV Narasimha Rao : భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహ రావుకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఇస్తున్నట్టు.. శుక్రవారం ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయనతో పాటు.. మరో మాజీ ప్రధాని చరణ్​ సింగ్​, ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్​ స్వామినాథన్​కి కూడా భారత రత్న ఇస్తున్నట్టు వెల్లడించారు.

yearly horoscope entry point

1991 నుంచి 1996 వరకు ప్రధానిగా పని చేశారు పీవీ నరసింహ రావు. భారత దేశ ఆర్థిక సంస్కరణల్లో ఆయన పాత్ర చాలా కీలకం. ఇక మరో మాజీ ప్రధాని చరణ్​ సింగ్​.. 1979లో కొంతకాలం ప్రధానిగా విధులు నిర్వహించారు. రైతులు- కార్మిక హక్కుల కోసం ఆయన పోరాడిన తీరు స్ఫూర్తిదాయకం. ఇక ఇండియాలో గ్రీన్​ రివొల్యూషన్​కి ఆర్కిటెక్ట్​.. ఎంఎస్​ స్వామినాథన్​.

1921లో ఆంధ్రప్రదేశ్​లోని కరీంనగర్​లో జన్మించారు పీవీ నరసింహ రావు. హైదరాబాద్​లోని ఉస్మానియా యూనివర్సిటీ, బాంబే వర్సిటీ, నాగ్​పూర్​ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

PV Narasimha Rao Bharat Ratna : "మాజీ ప్రధాని శ్రీ నరసింహ రావు గారికి భారత రత్న ఇస్తున్నట్టు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఓ గొప్ప రాజకీయవేత్త. అనేక మార్గాల్లో దేశానికి సేవ చేశారు. ఆంధ్రప్రదేశ్​ సీఎంగాను ఆయన చాలా గొప్పగా బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర మంత్రి, ఎంపీ, శాసనసభల్లో ఎన్నో ఏళ్ల పాటు ఆయన చేసిన కృషిని ఎవరు మర్చిపోలేరు. విజన్​ ఉన్న గొప్ప నాయకుడు నరసింహ రావు. దేశ ప్రగతికి, వృద్ధికి ఆయన పునాది వేశారు," అని ప్రధాని మోదీ ట్వీట్​ చేశారు.

"మాజీ ప్రధాని చౌదరి చరణ్​ సింగ్​కి భారత రత్న ఇస్తుండటం మా ప్రభుత్వం అదృష్టం. ఆయన చేసిన దేశ సేవకు ఈ పురస్కారం అంకితం. ఉత్తర్​ ప్రదేశ్​కి సీఎంగానైనా, దేశానికి హోంమంత్రిగానైనా, ఎమ్మెల్యేగానైనా.. ఆయన సేవ స్ఫూర్తిదాయకం. ఎమర్జెన్సీ సమయంలో చాలా దృఢంగా నిలబడ్డారు. రైతు హక్కుల కోసం ఆయన చాలా కృషిచేశారు," అని మోదీ అన్నారు.

Charan Singh Bharat Ratna : "డా. ఎంఎస్​ స్వామినాథన్​కి భారత రత్న పురస్కారాన్ని అందిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. భారత దేశ వ్యవసాయ రంగానికి, రైతుల సంక్షేమానికి ఆయన చేసిన సేవి అంతా ఇంతా కాదు. వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంలో ఆయన కృషి ఎంతో ఉంది. కఠినమైన సవాళ్లు ఎదురైన సమయంలో.. తన పనితో వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించారు," అని మోదీ అన్నారు.

రికార్డు స్థాయిలో భారత రత్నలు..!

తాజాగా.. ముగ్గురికి భారత రత్నను ప్రకటించింది కేంద్రం. కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటికే ఇద్దరికి ఈ పురస్కారాన్ని అందించింది. వారు.. బీజేపీ దిగ్గజం ఎల్​కే అద్వానీ, బిహార్​ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్​.

MS Swaminathan Bharat Ratna : అంటే.. ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురికి భారత రత్న పుస్కారాన్ని అందించింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం.

Whats_app_banner