LK Advani Bharat Ratna : బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి భారత రత్న
LK Advani Bharat Ratna : బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి భారత రత్న ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు ట్వీట్ చేశారు.
LK Advani Bharat Ratna : భారత దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నని.. బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
"శ్రీ ఎల్కే అద్వానీకి భారత రత్న పురస్కారాన్ని ఇస్తున్నామని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. పురస్కారం ఇస్తున్నామని ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాను. భారత దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకం. క్షేత్రస్థాయి కార్మికుడి స్థాయి నుంచి భారత దేశ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా ఎదిగారు ఆయన. హోంమంత్రి, ఐబీశాఖ మంత్రిగానూ పనిచేశారు. పార్లమెంట్లో ఆయన పనితీరు ఎందరినో ప్రభావితం చేసింది. పారదర్శకత, సమగ్రతతో.. దశాబ్దాల పాటు ఆయన ప్రజా సేవ చేశారు. అందరు గౌరవించే రాజనీతిజ్ఞుడు అద్వానీ. దేశ ఐకమత్యానికి ఎంతో కృషి చేశారు. అద్వానీకి భారత రత్న లభించడం నాకు నిజంగా భావోద్వేగమైన విషయం. ఆయనతో అనేకమార్లు మాట్లాడే అవకాశం నాకు లభించడం ఒక ప్రివిలేజ్‌గా భావిస్తున్నాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను," అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
Bharat Ratna for LK Advani : 96ఏళ్ల అద్వానీ.. కొన్నేళ్ల క్రితం వరకు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహించారు. 1970 నుంచి 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా వ్యవహించారు. రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో డిప్యూటీ పీఎంగా పనిచేశారు.
కేంద్ర ప్రభుత్వం.. భారత రత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. బిహార్ మాజీ సీఎం, అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ఇస్తున్నట్టు జనవరి 23న ప్రకటించింది కేంద్రం.
అద్వానీ ప్రయాణం..
1927 నవంబర్ 8న జన్మించిన ఎల్కే అద్వానీ.. దేశ విభజనకు ముందు సింధ్ ప్రాంతంలో పెరిగారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు నచ్చి, 14వ ఏటలోనే అందులో చేరారు. 1980-1990 దశకంలో బీజేపీని జాతీయస్థాయిలో బలపరిచేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన కృషితో కమలదళం శక్తివంతంగా ఎదిగింది. 1984లో కేవలం 2 సీట్లే దక్కించున్న బీజేపీ.. 1989 సార్వత్రిక ఎన్నికల్లో 86 చోట్ల గెలిచింది. 1992లో 121 సీట్లు, 1996లో 161 సీట్లు గెలిచి, స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించింది.
LK Advani latest news : 1986-90, 1993- 98, 2004- 05 మధ్య కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పని చేశారు అద్వానీ. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్ సోమ్‌నాథ్‌లో మొదలైన రథ్ యాత్రకు రథ సారథిగా వ్యవహరించారు అద్వానీ. 1992 డిసెంబర్ 6న జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనతో రథ యాత్రను ముగించారు. విలువలతో కూడిన మనిషిగా అద్వానీకి మంచి పేరు ఉంది. దేశాభివృద్ధికి ఆయన ఎంతో సేవ చేశారు.
సంబంధిత కథనం