PM Modi greets Advani on 95th birthday: నేడు బీజేపీ అగ్రనేత అద్వానీ పుట్టినరోజు-pm modi other bjp leaders greet advani on 95th birthday ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Greets Advani On 95th Birthday: నేడు బీజేపీ అగ్రనేత అద్వానీ పుట్టినరోజు

PM Modi greets Advani on 95th birthday: నేడు బీజేపీ అగ్రనేత అద్వానీ పుట్టినరోజు

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 03:17 PM IST

Advani birthday: బీజేపీ కురు వృద్ధుడు, పార్టీ ప్రస్తుత జైత్రయాత్రలకు పునాది వేసిన ఎల్ కే అద్వానీ పుట్టిన రోజు నేడు. ఈ నవంబర్ 8వ తేదీకి ఆయనకు 95 ఏళ్లు నిండాయి.

అద్వానీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రధాని మోదీ
అద్వానీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రధాని మోదీ (PM Narendra Modi Twitter)

Advani birthday: భారతీయ జనతా పార్టీ(BJP) దేశవ్యాప్తంగా విస్తరించడానికి కారణమైన ముఖ్యనేతల్లో ఒకరైన ఎల్ కే అద్వానీ జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీలోని ఇతర ముఖ్యనేతలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advani birthday: ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం Advani కి మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘ఆయన దార్శనికతకు, మేథో సంపత్తికి భారతీయులందరూ అద్వానీని గౌరవిస్తారు. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర మరవలేనిది. BJPని బలోపేతం చేయడంలొ అద్వానీ చేసిన కృషి అద్వితీయం. ఆయన మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు.

Advani birthday: అమిత్ షా తదితరులు..

అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘BJPని పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంలో అద్వానీ పాత్ర మరవలేనిది’ అని అమిత్ షా పేర్కొన్నారు. Advani తమకు అనునిత్యం స్ఫూర్తినిచ్చే నేత అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. బీజేపీలో అత్యున్నత నేత అద్వానీనేనన్నారు. అద్వానీ పార్టీలో ఎందరో యువ నేతలను తీర్చిదిద్దారని , భారత దేశ రాజకీయాల్లో ఆయన శిఖర సమానుడని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.

Advani birthday: 1927లో జననం

ఎల్ కే అద్వానీ 1927 నవంబర్ 8న నేటి పాకిస్తాన్ లో ఉన్న కరాచీలో జన్మించారు. చిన్న వయస్సులోనే RSS లో చేరారు. ఆ తరువాత జనసంఘ్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1980లో భారతీయ జనతా పార్టీ ప్రారంభమైనప్పుడు, ఆ పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల పాటు మరో కీలక నేత, మాజీ ప్రధాని, తన స్నేహితుడు వాజపేయ్, అద్వానీ లు బీజేపీ అగ్ర నేతలుగా వెలుగొందారు. బీజేపీకి అత్యధిక కాలం అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు కూడా Advaniనే.

Advani birthday: రథయాత్ర

అయోధ్యలో రామాలయ నిర్మాణం లక్ష్యంగా 1990లో అద్వానీ ప్రారంభించిన రథయాత్ర దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ రాజకీయాలను మలుపు తిప్పింది. బీజేపీ ఎదుగుదలకు, తదనంతర కాలంలో పార్టీ అధికారంలో రావడానికి ఆ రథయాత్ర పునాది వేసింది. తన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు సునాయాసంగా అందుకున్న అద్వానీకి ప్రధాని పదవి మాత్రం అందని ద్రాక్షగానే ఉండిపోయింది.

Whats_app_banner