Sushil Modi death : బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత..
Sushil Modi death news : బిహార్ రాజకీయ దిగ్గజం, రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. గత కొంతకాాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
Sushil Kumar modi death cause : గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. దిల్లీ ఎయిమ్స్ ఐఎస్యూలో నెల రోజులుగా చికిత్స పొందుతూ.. సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 72ఏళ్ల సుశీల్ కుమార్ మోదీ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బిహార్ రాజకీయ దిగ్గజం..
బిహార్ రాజకీయాలో ఒక వెలుగువెలిగారు సుశీల్ కుమార్ మోదీ. బిహార్‌లో బీజేపీ ఎదుగుదలకు.. మూడు దశాబ్దాల పాటు ఎనలేని సేవ చేశారు. ఆయన లేని లోటును భర్తీ చేయడం చాలా కష్టమని బీజేపీ శ్రేణులు అంటున్నారు.
పట్నా యూనివర్సిటీ నుంచి సుశీల్ మోదీ రాజకీయ వృత్తి మొదలైంది. 1973లో పట్నా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్‌కి జనరల్ సెక్రటరీ అయ్యారు. లాలూ ప్రసాద్ యాదవ్.. ఆ సమయంలో యూనియన్‌కి అధ్యక్షుడిగా ఉండేవారు. అనంతర కాలంలో లాలూ.. సుశీల్ మోదీకి అతిపెద్ద రాజకీయ శత్రువు అయ్యారు.
1990 లో పట్నా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు సుశీల్ కుమార్ మోదీ. 1996 నుంచి 2004 వరకు.. బిహార్ అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజీషన్గా ఉన్నారు. తన 3 దశాబ్దాల పొలిటికల్ కెరీర్లో.. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ వంటి అనేక బాధ్యతలు చేపట్టారు. 2005-2020 మధ్యలో రెండు పర్యాయాలు.. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంలో బిహార్‌కు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు సుశీల్ కుమార్ మోదీ.
Sushil Modi death : కానీ.. కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. ఈ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ఏప్రిల్ 3న అధికారికంగా ప్రకటించారు.
"గత 6 నెలలుగా నేను కేన్సర్‌తో పోరాటం చేస్తున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీచేయలేను. ప్రధానికి అన్ని వివరాలను చెప్పాను. దేశం, బిహార్, పార్టీకి నా జీవితాన్ని అంకితం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది," అని ఏప్రిల్ 3న ట్విట్టర్లో ట్వీట్ చేశారు సుశీల్ కుమార్ మోదీ.
సుశీల్ కుమార్ మోదీ మరణంపై.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"బిహార్‌లో బీజేపీ విజయంలో సుశీల్ కుమార్ మోదీ పాత్ర చాలా ఉంది. ఎమర్జెన్సీని వ్యతిరేకించి, స్టూడెంట్ పాలిటిక్స్‌లో తనకంటూ పేరు సంపాదించుకున్నారు. కష్టపడే ఎమ్మెల్యేగా, అందరికి అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా ఆయనకు గుర్తింపు ఉంది. రాజకీయాలపై చాలా అవగాహన ఉంది. ఒక అడ్మినిస్ట్రేటర్‌గానూ చాలా పని చేశారు. జీఎస్టీ విషయంలో ఆయన చేసిన కృషిని ఎప్పటికి గుర్తుపెట్టుకుంటాము. సుశీల్ మోదీ మరణంతో ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి," అని ట్వీట్ చేశారు మోదీ.
Sushil Modi Bihar : ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సైతం సుశీల్ కుమార్ మోదీ మరణంపై విచారం వ్యక్తం చేశారు.
"సుశీల్ కుమార్ మోదీ మరణ వార్త చాలా బాధ కలిగించింది. మా సంరక్షకుడు, కష్టపడి పనిచేసే నేత మరణించం బాధాకరం," అని తేజస్వీ యాదవ్ అన్నారు.
సంబంధిత కథనం