‘‘భార్య బికినీ కోరిక తీర్చడానికి రూ. 400 కోట్లతో ఏకంగా ఒక ద్వీపాన్నే కొనేశాడు’’
దుబాయ్ కు చెందిన ఒక బిలియనీర్.. బీచ్ లో బికినీ ధరించాలన్న తన భార్య కోరిక తీర్చడం కోసం ఏకంగా ఒక ప్రైవేటు ఐలండ్ నే కొనేశాడు. అందుకు 5 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాడు. తాను బీచ్ లో సురక్షితంగా బికినీలో గడపడం కోసం తన భర్త ఒక ద్వీపాన్నే కొన్నారని ఆ గృహిణి తన ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో వెల్లడించింది.
Dubai millionaire: బీచ్ లో బికినీలో ఎంజాయ్ చేయాలన్న తన కోరిక తీర్చడం కోసం దుబాయ్ కు చెందిన తన మిలియనీర్ భర్త ఏకంగా 5 కోట్ల డాలర్లతో ఒక ప్రైవేటు ద్వీపాన్ని కొన్నారని ఒక గృహిణి తన ఇన్ స్టా పోస్ట్ లో వెల్లడించింది. తాను సురక్షితంగా బీచ్ లో బికినీలో గడపడం కోసం తన భర్త ఆ పని చేశాడని 26 ఏళ్ల సౌది అల్ నాదక్ వెల్లడించింది.
సౌదీ మిలియనీర్ ప్రేమ
26 ఏళ్ల సౌది అల్ నాదక్ ఈ ప్రైవేట్ ద్వీపానికి సంబంధించిన వీడియోను కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. 26 ఏళ్ల సౌది దుబాయ్ వ్యాపారవేత్త జమాల్ అల్ నాదక్ భార్య అయిన సౌది అల్ నాదక్ తాను ఫుల్ టైమ్ గృహిణిని అని తెలిపింది. దుబాయ్ లో చదువుకుంటున్న సమయంలో తమ మధ్య జరిగిన పరిచయం ప్రేమగా మారిందని, మూడేళ్ల క్రితం తమకు వివాహమైందని ఆమె వెల్లడించింది.
ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్
సంపన్న గృహిణిగానే కాకుండా, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా సౌది అల్ నాదక్ ప్రసిద్ది చెందింది. ఆమె ఇన్స్టాగ్రామ్ (instagram), టిక్టాక్ ఖాతాలు ఆమె విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శిస్తాయి. ఉదాహరణకు, ఒక వీడియోలో, ఈ జంట 1 మిలియన్ డాలర్లకు డైమండ్ సాలిటైర్ ఉంగరాన్ని కొనుగోలు చేస్తుంది. మరో వీడియోలో 2 మిలియన్ డాలర్లను కళాకృతి కొనుగోలు కోసం వెచ్చిస్తుంది. సౌది అల్ నాదక్ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ ఉంటాయి.
ప్రైవేట్ ఐలండ్ వీడియో వైరల్
తన భర్త తన కోసం మొత్తం ద్వీపాన్ని కొన్నాడని వెల్లడిస్తూ, ఆ ప్రైవేట్ ఐలండ్ ను చూపిస్తూ సౌది అల్ నాదక్ ఇన్ స్టా లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోకు వారం రోజుల్లోనే 2.4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తనకు బహుమతిగానే కాకుండా, ఒక పెట్టుబడిగా కూడా తన భర్త ఈ ద్వీపాన్ని కొనుగోలు చేశాడని HT.com కు సౌది అల్ నాదక్ తెలిపారు.
సీక్రెట్ ఐలండ్
గోప్యత, భద్రతా కారణాల వల్ల తాము కొనుగోలు చేసిన ఆ ద్వీపం ఎక్కడ ఉందో కచ్చితమైన లొకేషన్ తాను చెప్పలేనని సౌది అల్ నాదక్ తెలిపారు. అయితే ఇది ఆసియాలో ఉందని, దాని ధర 50 మిలియన్ డాలర్లు అని ఆమె HT.com చెప్పారు.
విమర్శలు కూడా
ఆమె ఇన్ స్టా వీడియోలపై సౌదీలో సంప్రదాయవాదుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి.యూకేలో జన్మించి, అక్కడే విద్యాభ్యాసం చేసిన సౌది అల్ నాదక్ ఇన్ స్టా గ్రామ్, టిక్ టాక్ వీడియోల్లో ఆమె గ్లామరస్ హాలిడేస్, ఫ్యాన్సీ డిన్నర్లు, డిజైనర్ బొటిక్ లలో షాపింగ్, ఇతర వైవిధ్యభరితమైన జీవనశైలిని చూపించే ఫోటోలు, వీడియోలు ఉంటాయి.