Man Urinates on Woman: విమానంలో మహిళపై మూత్రం పోసిన వ్యక్తి.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‍లో..-drunk man urinates on woman in new york delhi air india flight ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Urinates On Woman: విమానంలో మహిళపై మూత్రం పోసిన వ్యక్తి.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‍లో..

Man Urinates on Woman: విమానంలో మహిళపై మూత్రం పోసిన వ్యక్తి.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‍లో..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 04, 2023 12:24 PM IST

Man Urinates on Woman in Flight: ఫుల్‍గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‍లో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. దీనిపై వారాల తర్వాత ఎయిర్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Man Urinates on Woman in Flight: ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఓ విస్తుపోయే ఘటన తాజాగా బయటికి వచ్చింది. ఫుల్‍గా మద్యం తాగిన ఓ వ్యక్తి.. బిజినెస్ క్లాస్‍లో తన పక్కనే కూర్చున్న మహిళపై మూత్రం పోశారన్న సమాచారం బయటికి వచ్చింది. నవంబర్‌లో ఇది జరగగా.. అప్పట్లో ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే, ఈ ఘటన జరిగిన ఇన్ని వారాల తర్వాత.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని నో ఫ్లయ్ లిస్టులో చేర్చాలని ఎయిర్ ఇండియా.. విమానయాన శాఖకు సిఫార్సులు పంపింది. దీంతో ఈ విషయం బయటికి వచ్చింది. వివరాలివే..

ఇదీ జరిగింది

2022 నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన జరిగింది. బిజినెస్ క్లాస్‍లో ప్రయాణిస్తుండగా.. సుమారు 70 సంవత్సరాల వయసు ఉన్న మహిళపై ఓ వ్యక్తి మూత్రం పోశాడు. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు వారించారు. అయినా మూత్రం పోసిన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడి నుంచి చాలాసేపు కదల్లేదని తెలిసింది. తన దుస్తులు, బూట్లు, బ్యాగ్ మూత్రంతో తడిచిపోయాయని ఆ మహిళల విమాన సిబ్బందికి ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. ఇంతటి దారుణ ప్రవర్తన కనబరిచిన ఆ ప్రయాణికుడు.. ఢిల్లీలో దిగిన తర్వాత వెళ్లిపోయాడు. ఆయనను ఎవరూ అడ్డుకోలేదు.

ఫిర్యాదు చేయటంతో..

ఈ ఘటనతో ఎంతో ఆవేదన చెందిన ఆ మహిళా ప్రయాణికురాలు.. టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‍కు లేఖ రాశారని సమాచారం. విమానంలో ఇంత దారుణంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఆ లేఖ ద్వారా ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో ఎయిర్ ఇండియా చర్యలకు ఉపక్రమించింది. దారుణంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిని విమానాలు ఎక్కేందుకు వీలు లేకుండా నో ఫ్లై లిస్టులో చేర్చాలని విమానయాన శాఖకు ప్రతిపాదన పంపింది.

మరోవైపు, ఈ ఘటన తర్వాత ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియాను ఆదేశించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA).

Whats_app_banner

టాపిక్