CUET UG Admit Card 2023 : సీయూఈటీ యూజీ అడ్మిట్​ కార్డులు విడుదల..-cuet ug admit card 2023 released check download link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Cuet Ug Admit Card 2023 Released Check Download Link Here

CUET UG Admit Card 2023 : సీయూఈటీ యూజీ అడ్మిట్​ కార్డులు విడుదల..

Sharath Chitturi HT Telugu
May 19, 2023 11:54 AM IST

CUET UG Admit Card 2023 : సీయూఈటీ యూజీ అడ్మిట్​ కార్డులు విడుదలయ్యాయి. డౌన్​లోడ్​ లింక్​తో పాటు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

సీయూఈటీ యూజీ అడ్మిట్​ కార్డు విడుదల..
సీయూఈటీ యూజీ అడ్మిట్​ కార్డు విడుదల..

CUET UG Admit Card 2023 : 2023 సీయూఈటీ యూజీ అడ్మిట్​ కార్డులను విడుదల చేసింది ఎన్​టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ). ఈ కామన్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్​ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్​ కార్డులను cuet.samarth.ac.in లో డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన అడ్మిట్​ కార్డులను ఎన్​టీఏ తాజాగా విడుదల చేసింది. అడ్మిట్​ కార్డును డౌన్​లోడ్​ చేసుకునేందుకు డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేసుకోండి.

సీయూఈటీ యూజీ అడ్మిట్​ కార్డును ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

స్టెప్​ 1:- సీయూఈటీ యూజీ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో ఉన్న సీయూఈటీ యూజీ అడ్మిట్​ కార్డ్​ 2023 లింక్​పై క్లిక్​ చేయండి.

CUET UG Admit Card download : స్టెప్​ 3:- మీ లాగిన్​ వివరాలు ఇచ్చి.. సబ్మీట్​ బటన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- మీ అడ్మిట్​ కార్డు స్క్రీన్​పై కనిపిస్తుంది.

స్టెప్​ 5:- మీ అడ్మిట్​ కార్డును చెక్​ చేసుకుని డౌన్​లోడ్​ చేసుకోండి.

ఇదీ చూడండి:- CUET-UG: సీయూఈటీ యూజీ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు

సంబంధిత పరీక్షల వివరాలు అడ్మిట్​ కార్డులో ఉంటాయి. ఇతర తేదీల్లో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు సంబంధించిన అడ్మిట్​ కార్డులను కొన్ని రోజుల తర్వాత విడుదల చేయనుంది ఎన్​టీఏ.

దూరంగా పరీక్షా కేంద్రాలు..!

CUET UG Admit Card 2023 release : సీయూఈటీ యూజీ పరీక్షల తీరుపై అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొన్నట్టు కనిపిస్తోంది! ఇందుకు పరీక్షా కేంద్రాల కేటాయింపులే కారణం. ఉదాహరణకు.. ముంబైలో నివాసముంటున్న అభ్యర్థులకు.. అక్కడి నుంచి 200-400 కి.మీల దూరంలోని పరీక్షా కేంద్రాలను కేటాయిస్తున్నారు అధికారులు. పైగా.. పరీక్షా సమయానికి ఒక్క నిమిషం కూడా ఆలస్యం అవ్వకూడదని హెచ్చరికలు ఇస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ముంబై వంటి ప్రాంతాల్లో నివాసముంటూ.. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే, ట్రాఫిక్​కే సగం సమయం అయిపోతుందని తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఎన్​టీఏ అధికారులు స్పందించలేదు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్