Covid JN1 cases in India : అలర్ట్.. న్యూ ఇయర్ వేడుకల కోసం గోవాకి వెళుతున్నారా?
Covid JN1 cases in India : న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా ప్లాన్ వేస్తున్న వారికి అలర్ట్. అక్కడ కొవిడ్ కొత్త సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు అత్యధికంగా ఉన్నాయి!
Covid JN1 cases in India : న్యూ ఇయర్ వేడుకల కోసం దేశం సన్నద్ధమవుతున్న సమయంలోనే కొవిడ్ కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసులు పెరుగుతున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నూతన ఏడాది సంబరాల హడావుడి అధికంగా ఉండే గోవాలోనే ఈ సబ్ వేరియంట్ కేసులు అధికంగా నమోదవుతుండటం మరింత ఆందోళనకర విషయం. ఆదివారం నాటికి.. దేశంలో మొత్తం 63 జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు ఉండగా, వాటిల్లో 34.. గోవాలోనే రికార్డ్ అయ్యాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 1 కేసు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది.
కొవిడ్ సబ్‌వేరియంట్ జేఎన్.1పై నివేదిక ప్రకారం..
దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల సంఖ్య 4,054గా ఉంది. వీటిల్లో.. కేరళోలనే అత్యధిక యాక్టివ్ కేసులున్నాయి.
"కొవిడ్ పరీక్షలను పెంచాము. రోజుకు 3 నుంచి 4 కేసులే వస్తున్నాయి. 1శాతం కన్నా తక్కువే ఇవి. జేఎన్.1 కొవిడ్ వేరియంట్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. మాక్ డ్రిల్స్ నిర్వహించాము. అన్ని చర్యలు తీసుకున్నాము," అని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
Covid cases in India Today : తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో 989 సాంపిల్స్‌ని పరీక్షించగా వాటిల్లో 10 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చింది. 8,40,392మంది కొవిడ్ రోగులు రికవర్ అయ్యారు.
మహారాష్ట్ర పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం.. ఆ రాష్ట్రంలో సోమవారం 28 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా యాక్టివ్ కేసుల సంఖ్య 153కి పెరిగింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. 1972 కేసులు ఈ వేరియంట్‌కి చెందినవే! 19మంది ప్రాణాలు కోల్పోయారు.
గత వేరియంట్లతో పోల్చుకుంటే కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 అంత ప్రమాదకరంగా కనిపించడం లేదు. రోగుల్లో కూడా స్వల్ప సమస్యలను మాత్రమే సృష్టిస్తోంది.
Covid JN1 cases latest news : కర్ణాటకలో 125 కొవిడ్ కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల్లో ముగ్గురు మరణించారు. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 436గా ఉంది.
జేఎన్.1 తో ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం బెటర్ అని అన్నారు.
సంబంధిత కథనం