Covid alert: కొత్త వేరియంట్ ఎక్స్ఈసీ తో యూరోప్ లో పెరుగుతున్న కేసులు; మరోసారి కోవిడ్ ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు-covid resurgence alert scientists warn of xec variant surge this winter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Covid Alert: కొత్త వేరియంట్ ఎక్స్ఈసీ తో యూరోప్ లో పెరుగుతున్న కేసులు; మరోసారి కోవిడ్ ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు

Covid alert: కొత్త వేరియంట్ ఎక్స్ఈసీ తో యూరోప్ లో పెరుగుతున్న కేసులు; మరోసారి కోవిడ్ ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు

Sudarshan V HT Telugu
Sep 18, 2024 05:16 PM IST

Covid Alert: కొరోనా వైరస్ పూర్తిగా రూపుమాసిపోలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్తగా గుర్తించిన ఎక్స్ఈసీ వేరియంట్ ప్రమాదకారిగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వేరియంట్ ను మొదట జర్మనీలో గుర్తించారు.ఈ వేరియంట్ లక్షణాలు మునుపటి స్ట్రెయిన్ల మాదిరిగానే ఉంటాయని తెలిపారు.

కొత్త వేరియంట్ ఎక్స్ఈసీ తో మళ్లీ కోవిడ్ ముప్పు
కొత్త వేరియంట్ ఎక్స్ఈసీ తో మళ్లీ కోవిడ్ ముప్పు (HT_PRINT)

Covid Alert: కొత్త కోవిడ్ వేరియంట్ ఎక్స్ఈసీ ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది త్వరలోనే ఆధిపత్య స్ట్రెయిన్ గా మారే అవకాశం ఉంది. జూన్ 2024 లో జర్మనీలో మొదటిసారిగా ఈ ఎక్స్ఈసీ వేరియంట్ ను గుర్తించారు. ఆ తరువాత, ఈ వేరియంట్ కేసులు యూకే, యూఎస్, డెన్మార్క్, ఇతర దేశాలకు వ్యాపించాయి.

కోవిడ్ వేరియంట్ ఎక్స్ఈసీ

ఒమిక్రాన్ వేరియంట్ నుంచి ఎక్స్ఈసీ వేరియంట్ ఆవిర్భవించింది. ఈ శీతాకాలంలో ఈ వేరియంట్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అయితే, ఈ వేరియంట్ పై టీకాలు ప్రభావం చూపుతాయి. కోవిడ్ తీవ్రమైన కేసులను నివారించడంలో టీకాలు ప్రభావవంతంగా ఉన్నాయి. ఎక్కువ ప్రమాదం ఉన్నవారు ముందుజాగ్రత్తగా బూస్టర్ షాట్ ను తీసుకోవడం మంచిది.

ఈ శీతాకాలంలో ఎక్స్ఈసీ వ్యాప్తి

కోవిడ్ వేరియంట్ ఎక్స్ఈసీ ఇటీవలి వేరియంట్ల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, అయితే, దానిపై టీకాలు బలమైన ప్రభావం చూపుతాయని యూనివర్శిటీ కాలేజ్ లండన్ లోని జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఫ్రాంకోయిస్ బల్లోక్స్ తెలిపారు. శీతాకాలంలో ఎక్స్ఈసీ ఆధిపత్యం చెలాయించవచ్చని ఆయన హెచ్చరించారు.

ఎక్స్ఈసీ వేరియంట్ కోవిడ్ లక్షణాలు

– తీవ్రమైన జ్వరం

- నొప్పులు మరియు అలసట

- దగ్గు లేదా గొంతు నొప్పి

- చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు, అయితే కొంతమందిలో దీర్ఘకాలిక లక్షణాలు కనిపిస్తాయి.

డెన్మార్క్, జర్మనీల్లో ఎక్స్ఈసీ కేసులు భారీగా పెరుగుతున్నాయని కోవిడ్ డేటా అనలిస్ట్ మైక్ హనీ హెచ్చరించారు. ‘‘కోవిడ్ -19 (covid 19)తో వచ్చే తీవ్రమైన అనారోగ్యం నుండి టీకా ఉత్తమ రక్షణను అందిస్తుంది. ముప్పు ఎక్కువగా ఉన్న వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలి’’ అని యూకేహెచ్ఎస్ఏ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాయత్రి అమృతలింగం తెలిపారు.

అన్ని వేరియంట్లను ఎదుర్కొనే యాంటీబాడీలు

కోవిడ్ -19 కు కారణమైన కరోనా వైరస్ అన్ని వేరియంట్లను, అలాగే ఇతర జంతువులకు సోకే సంబంధిత జాతులను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న ఎస్సీ 27 అనే యాంటీబాడీని ఆస్టిన్ లోని టెక్సాస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు వేరు చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్లకు గురైన నలుగురు రోగులు దానం చేసిన ప్లాస్మా ద్వారా ఈ పురోగతి వచ్చింది. సెల్ రిపోర్ట్స్ మెడిసిన్ లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.