Chintan Shivir | అదిగో ‘నవ సంకల్పం’.. భారీ మార్పులకు పునాది!-congress adopts nav sankalp approves wide ranging reforms at chintan shivir ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chintan Shivir | అదిగో ‘నవ సంకల్పం’.. భారీ మార్పులకు పునాది!

Chintan Shivir | అదిగో ‘నవ సంకల్పం’.. భారీ మార్పులకు పునాది!

HT Telugu Desk HT Telugu
May 15, 2022 04:09 PM IST

Chintan Shivir చింతన్​ శిబిర్​లో మూడో రోజు.. కీలక సంస్కరణలు ఆమోద ముద్రవేసింది కాంగ్రెస్​. అక్టోబర్​లో దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్టు రాహుల్​ గాంధీ వెల్లడించారు.

<p>చింతన్​ శిబిర్​లో సోనియా- రాహుల్​ గాంధీ</p>
చింతన్​ శిబిర్​లో సోనియా- రాహుల్​ గాంధీ (HT_PRINT)

Chintan Shivir Udaipur | రాజస్థాన్​ వేదికగా జరుగుతున్న చింతన్​ శిబిర్​లో చివరి రోజైన ఆదివారం నాడు.. 'నవ సంకల్ప్​' తీర్మానాన్ని కాంగ్రెస్​ ఆమెదించింది. పార్టీ బలోపేతం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారీ సంస్కరణలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

గాంధీల కోసం సవరణ..!

చింతన్​ శిబిర్​లో భాగంగా.. 'ఒక కుటుంబం- ఒక టికెట్​' ఫార్ములాకు కాంగ్రెస్​ ఆమెద ముద్ర వేసింది. కాగా ఇందులో ఒక సవరణను ఇచ్చింది. ఒక కుటుంబం నుంచి మరో వ్యక్తి పోటీకి దిగాలి అని అనుకుంటే.. పార్టీలో ఆ మనిషి కచ్చితంగా ఐదేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే.. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలు.. ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటికే అర్హత పొందేశారు. అదే సమయంలో ఎన్నికల్లో పోటీకి ఎలాంటి వయస్సు పరిమితి పెట్టలేదు.

Congress Chintan Shivir | సమాజంలోని బడుగు బలహీన వర్గాలను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్​ ముదుకొచ్చింది. కాంగ్రెస్​లోని అన్ని స్థాయిల్లో ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీలు 50శాతం ప్రాతినిధ్యం వహించే విధంగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. చింతన్​ శిబిర్​లో భాగంగా జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు.. కాంగ్రెస్​ ఎలక్షన్​ కమిటీ స్థానంలో పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేయాలన్న పార్టీ 'రెబల్స్​' ప్రతిపాదనను హైకమాండ్​ తోసిపుచ్చింది. కాగా.. ప్రతి రాష్ట్రంతో పాటు కేంద్రంలో పొలిటికల్​ అఫైర్స్​ కమిటీని నియమించాలని నిర్ణయించింది.

ఈవీఎంలకు స్వస్తి..!

ఇటీవలి కాలంలో ఈవీఎంల పనితీరుపై తీవ్రస్థయిలో విమర్శలు చేసింది. తాజాగా.. అధికారంలోకి వస్తే.. ఈవీఎంలను తొలగించి, బ్యాలెట్​ పేపర్ల పద్ధతిని తీసుకు వచ్చేందుకు చేసిన తీర్మానానికి ప్రాథమికంగా ఆమోద ముద్రవేసింది.

కాగా.. 2004, 2008 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిచినప్పుడు.. ఈవీఎంలే ఉండటం గమనార్హం. ఆ తర్వాత కాంగ్రెస్​ గెలిచిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఈవీఎంలనే వినియోగించారు. పైగా.. ఈవీఎంలను ట్యాంపరింగ్​ చేయవచ్చన్న కాంగ్రెస్​ ఆరోపణలకు ఆధారాలు లేవు.

దేశవ్యాప్తంగా 'యాత్ర'..!

Rahul Gandhi | చింతిన్​ శిబిర్​లో భాగంగా కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ప్రసంగించారు. సామాన్యుడితో బంధం తెగిపోవడం వల్లే పార్టీ గెలవడం లేదని అభిప్రాయపడ్డారు.

"సామాన్యుడితో మన బంధం తెగిపోయిందని అంగీకరించాలి. ఆ బంధాన్ని పునరుద్ధరించుకోవాలి. షార్ట్​కట్స్​తో ఆ పని జరగదు. కఠిన శ్రమ అవసరం. ప్రజల్లో కలిసిపోయేందుకు.. వారితో బంధాన్ని దృఢపరుచుకునేందుకు.. అక్టోబర్​లో దేశవ్యాప్తంగా యాత్ర చేపడతాము," అని రాహుల్​ గాంధీ అన్నారు.

ఈ సంస్కరణలు సరిపోతాయా?

Congress Chintan Shivir 2022 | ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ దారుణ ప్రదర్శన చేసింది. చాలా రాష్ట్రాల్లో కనీసం తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. ఈ క్రమంలోనే పార్టీకి పునర్​వైభవాన్ని తీసుకొచ్చేందుకు హైకమాండ్​ సిద్ధపడింది. ఈ క్రమంలోనే ఉదయ్​పూర్​లో మూడురోజుల పాటు చింతన్​ శిబిర్​ను నిర్వహించింది. పార్టీ బలోపేతం, సిద్ధాంతాలతో పాటు, సమాజం, ప్రజల సమస్యలు, బీజేపీ పాలనపై కాంగ్రెస్​ నేతలు సమాలోచనలు చేశారు.

దారుణంగా డీలాపడిన పార్టీని బలపరిచేందుకు.. ఈ సంస్కరణలు సరిపోతాయా? లేదా? అన్నది వేచిచూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం