Citroen electric car India : సిట్రోయెన్​ నుంచి తొలి ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​ ఎప్పుడంటే!-citroen to debut its first electric car in india check details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Citroen Electric Car India : సిట్రోయెన్​ నుంచి తొలి ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​ ఎప్పుడంటే!

Citroen electric car India : సిట్రోయెన్​ నుంచి తొలి ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​ ఎప్పుడంటే!

Sharath Chitturi HT Telugu
Sep 27, 2022 07:01 AM IST

Citroen electric car India launch : సిట్రోయెన్​ నుంచి భారత మార్కెట్​లోకి ఓ ఎలక్ట్రిక్​ కారు వస్తోంది. ఈ నెల 29న దానిని లాంచ్​ చేయనున్నట్టు తెలుస్తోంది.

<p>సిట్రోయెన్​ నుంచి మొదటి ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​ ఎప్పుడంటే!</p>
సిట్రోయెన్​ నుంచి మొదటి ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​ ఎప్పుడంటే!

Citroen electric car India launch date : ఫ్రెంచ్​ కార్​ మేకర్​ సిట్రోయెన్​.. ఇండియాలో తమ ఎలక్ట్రిక్​ వాహనాలను లాంచ్​ చేసేందుకు సిద్ధపడుతోంది. ఈ క్రమంలో.. ఈ నెల 29న సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్​ కారును ఆవిష్కరించనున్నట్టు సిట్రోయెన్​ ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్​ మీడియా ద్వారా వెల్లడించింది.

"ఈ నెల 29న కలుసుకుందాము," అని ఆ పోస్టులో వెల్లడించింది సిట్రోయెన్​ సంస్థ. 2023లో ఇండియాలో తొలి ఎలక్ట్రిక్​ కారును లాంచ్​ చేస్తామని సిట్రియోన్​ గతంలో చెప్పింది. సిట్రోయెన్​ సీ3 ఎస్​యూవీ లాంచ్​ సమయంలోనే ఎలక్ట్రిక్​ వాహనాలపై హింట్​ ఇచ్చింది. దాని కన్నా ముందే.. ఏర్పాట్లు చేసుకున్నట్టు తాజా పరిణామాల ద్వార తెలుస్తోంది.

Citroen electric car in India : అయితే సిట్రోయెన్​ ఎలక్ట్రిక్​ కారు.. సరసమైన ధరలో అందుబాటులోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. టాటా పంచ్​ వినియోగించే కామన్​ మాడ్యులర్​ ప్లాట్​ఫామ్​ ఆధారంగానే సిట్రోయెన్​ ఎలక్ట్రిక్​ కారు కూడా రూపొందుతుందని తెలుస్తోంది.

ఈ సిట్రోయెన్​ ఎలక్ట్రిక్​ కారుపై ప్రస్తుతం వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ నెల 29న దీనిపై మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే.. ఈ ఏడాది జులైలో లాంచ్​ చేసిన ఐసీఈ వర్షెన్​ను ఈ సిట్రోయెన్​ ఎలక్ట్రిక్​ కారు పోలి ఉంటుందని భావిస్తున్నారు. టాటా టియాగో ఈవీకి ఈ సిట్రోయెన్​ ఎలక్ట్రిక్​ కారు గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Citroen electric car launch : అంతర్జాతీయంగా.. నాలుగు ఎలక్ట్రిక్​ వాహనాలను అందిస్తోంది సిట్రోయెన్​. అమీ, సీ4 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ, రెండు ఎంపీవీలు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే సిట్రోయెన్​ సీ3 ఎలక్ట్రిక్​కి 50కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ లభించే అవకాశం ఉంది. సింగిల్​ ఛార్జింగ్​తో 350కి.మీలు ప్రయాణించవచ్చు. ఇది 1326బీహెచ్​పీ పవర్​, 260ఎన్​ఎం టార్క్​ జెనరేట్​ చేయగలదని తెలుస్తోంది.

Citroen electric car : ఎలక్ట్రిక్​ వాహనాల మార్కెట్​కు ఇండియా.. అత్యంత ఆకర్షణీయమైనదిగా మారింది. ఇటీవలి కాలంలో ఇక్కడ ఎలక్ట్రిక్​ వాహనాలను లాంచ్​ చేసేందుకు ఆటో సంస్థలన్నీ పోటీపడుతున్నాయి. ఈ సెగ్మెంట్​లో తొలుత ప్రవేశించిన టాటా మోటార్స్​కు 85శాతానికిపైగా మార్కెట్​ వాటా ఉంది. అయితే.. ఇటీవలి కాలంలో మహీంద్రా అండ్​ మహీంద్రా- టాటా మోటార్స్​ మధ్య ఎలక్ట్రిక్​ వాహనాల పోటీ విపరీతంగా పెరిగిపోయింది.

మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ లాంచ్​ చేసిన తొలి ఎలక్ట్రిక్​ వాహనం ఎక్స్​యూవీ400 గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం