Menstruation : 33ఏళ్ల పురుషుడికి ‘పీరియడ్స్’.. వైద్యులు షాక్
చైనాలో ఓ పురుషుడికి పీరియడ్స్ అవుతున్నాయి. 33ఏళ్ల తర్వాత అతను ఆ విషయాన్ని తెలుసుకున్నాడు!
మహిళల్లో పీరియడ్స్ అనేది చాలా సహజమైన ప్రక్రియ. పురుషుల్లో అది ఉండదు. కానీ చైనాలోని ఓ పురుషుడికి పీరియడ్స్ వస్తున్నాయి. 33ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని అతను తెలుసుకుని షాక్ అయ్యాడు.
33ఏళ్లకు..
మూత్రం సరిగ్గా రావడం లేదని 20ఏళ్ల క్రితం ఆ వ్యక్తికి వైద్యులు ఆపరేషన్ చేశారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత తరచూ మూత్రం నుంచి రక్తం వచ్చేది. కొంత కాలం తర్వాత.. అతనికి పొత్తి కడుపులో నొప్పి మొదలైంది. నాలుగు రోజులైనా తగ్గకపోవడంతో వైద్యుల దగ్గరకు వెళ్లారు. వారు పరీక్షలు నిర్వహించి అపెండిసైటిస్ అని తేల్చాచారు. వైద్యం చేసి పంపించేశారు. కానీ అతనికి కడుపు నొప్పి తగ్గలేదు.
అసలు విషయం గతేడాదే బయటపడింది. చెకప్ కోసం ఆ 33ఏళ్ల వ్యక్తి మళ్లీ వైద్యుల వద్దకు వెళ్లాడు. అతనికి వస్తున్న పొత్తి కడుపు నొప్పికి, మూత్రం ద్వారా బయటకు వస్తున్న రక్తానికి సంబంధం ఉందని నిర్ధరించారు. అతనికి పీరియడ్స్ వస్తున్నట్టు గ్రహించారు. ఆ 33ఏళ్ల వ్యక్తిలో ఫీమేల్ క్రోమోజోమ్స్ ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.
మరిన్ని పరీక్షలు చేయగా.. ఆ వ్యక్తిలో ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్లు అయిన యుటీరస్, ఓవరిస్ కనిపించాయి. అతనిలో మేల్ సెక్స్ హార్మోన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఫీమేల్ సెక్స్ హార్మోన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఆరోగ్యవంతమైన మహిళలాగే అతని అవయవాలు పనిచేస్తున్నాయి.
ఇలాంటి వారిని 'ఇంటర్సెక్స్' అని పిలుస్తారు. 30ఏళ్ల పాటు పురుషుడిగా ఉన్న అతనికి ఈ విషయం చాలా బాధ కలిగించింది. డిప్రెస్ అయిపోయాడు. ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్లు తొలగించాలని వైద్యులను అభ్యర్థించాడు.
గత నెల 6న అతనికి ఆపరేషన్ జరిగింది. అతను 10 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.
సంబంధిత కథనం