CBSE class 10, 12 compartment results: సీబీఎస్ఈ కంపార్ట్‌మెంట్ రిజల్ట్స్ ఇలా..
CBSE class 10, 12 compartment results: సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 కంపార్ట్‌మెంట్ ఎగ్జామ్ రిజల్ట్స్ 2022 అతి త్వరలో విడుదల కానున్నాయి. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే..
CBSE class 10, 12 compartment results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్ష ఫలితాలను రేపు ప్రకటించే అవకాశం ఉంది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లలో ప్రకటిస్తుంది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు cbse.nic.in, results.gov.in, cbse.gov.in వెబ్‌సైట్లలో ప్రకటిస్తారు.
సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 కంపార్ట్‌మెంట్ ఫలితాలు సెప్టెంబర్ 7న వెలువడే అవకాశం ఉంది. బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం 10వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలు 23 ఆగస్టు నుండి 29 ఆగస్టు 2022 వరకు జరిగాయి. 12వ తరగతి విద్యార్థులకు ఆగస్టు 23న కంపార్ట్‌మెంట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
CBSE class 10, 12 compartment results: ఎలా తనిఖీ చేయాలో ఇక్కడ ఉంది
స్టెప్ 1: అధికారిక CBSE సైట్ https://cbseresults.nic.in/ సందర్శించండి.
స్టెప్ 2: CBSE వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ పేరు, రోల్ నంబర్ వంటి మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి. దానిని సమర్పించండి.
స్టెప్ 4: మీ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
స్టెప్ 5: ఫలితాలను సేవ్ చేయండి.
మార్క్స్ వెరిఫికేషన్, రీ-వాల్యుయేషన్ ప్రక్రియల కోసం సీబీఎస్ఈ గతంలో తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది.
‘మార్కుల ధృవీకరణ, సమాధాన పుస్తకాల ఫోటోకాపీని పొందడం, కంపార్ట్‌మెంట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల సమాధానాల పునఃమూల్యాంకనానికి సంబంధించిన వివరణాత్మక పద్ధతులు రిజల్ట్స్ వెలువడిన తర్వాత జారీ చేస్తాం..’ అని అధికారిక ప్రకటన వెల్లడించింది.
సీబీఎస్ఈ బోర్డు రెండు పర్యాయాలు బోర్డు పరీక్షలను నిర్వహించింది. 12వ తరగతి మొత్తం ఉత్తీర్ణత శాతం 92.71 శాతంగా ఉంది. 10వ తరగతిలో 94.40 శాతంగా ఉంది.
టాపిక్