Leopard enters court: కోర్టు భవనంలోకి చిరుత పులి; భయంతో వణికిపోయిన సిబ్బంది-caught on camera leopard enters ghaziabad court leaves several injured ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Caught On Camera : Leopard Enters Ghaziabad Court, Leaves Several Injured

Leopard enters court: కోర్టు భవనంలోకి చిరుత పులి; భయంతో వణికిపోయిన సిబ్బంది

HT Telugu Desk HT Telugu
Feb 08, 2023 09:04 PM IST

Leopard enters court building: ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న కోర్టు భవనంలోకి ఒక చిరుత చొరబడింది. చిరుతను చూసిన అక్కడి ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు.

కోర్టు భవనంలో ఇనుప గేటు వెనుకాల చిరుత పులి
కోర్టు భవనంలో ఇనుప గేటు వెనుకాల చిరుత పులి

Leopard enters court building in UP: కోర్టు భవనంలోకి పొరపాటున ప్రవేశించిన చిరుత పులి అక్కడ ఉన్న వారిపై దాడి చేసింది. పెద్ద ఎత్తున ఉన్న ప్రజలను చూసి ఆందోళనకు గురైన చిరుత అక్కడ చెప్పులు రిపేర్ చేసే వ్యక్తితో పాటు, మరో వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది.

ట్రెండింగ్ వార్తలు

Leopard enters court building: ఇద్దరి పై దాడి

Leopard enters court building: ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న కోర్టు భవనం కాంపౌండ్ లోకి చొరబడిన చిరుత పులి అక్కడ ఉన్న కొంతమందిపై దాడి చేసి గాయపర్చింది. ఆ తరువాత, తనపై ఎవరూ దాడి చేయకుండా, కోర్టు ప్రాంగణంలో ఉన్న ఒక ఇనుప గేటు వెనకాల దాక్కుని, అప్రమత్తంగా అందరినీ గమనిస్తూ ఉండిపోయింది. అక్కడి వారిపై చిరుత దాడి చేస్తున్న దృశ్యాలను అక్కడ ఉన్న కొందరు తమ ఫోన్లలో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి క్షణాల్లో వైరల్ గా మారాయి.

Leopard enters court building: అటవీ అధికారులకు సమాచారం

కోర్టు భవనంలోకి చిరుత ప్రవేశించడంతో అక్కడి వారంతా తీవ్ర భయాందోళలకు గురయ్యారు. అరుపులు, కేకలతో తీవ్ర స్థాయి గందరగోళం నెలకొనడంతో మరింత కన్ఫ్యూజ్ అయిన చిరుత అక్కడి వారిపై దాడికి ప్రయత్నించింది. కోర్టు సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అక్కడికి అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు.

IPL_Entry_Point

టాపిక్