BSF Head Constable Recruitment : బీఎస్​ఎఫ్​లో​ 247 వేకెన్సీలకు నోటిఫికేషన్​.. ఇలా అప్లై చేసుకోండి!-bsf head constable recruitment applictaion process begins see full details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bsf Head Constable Recruitment : బీఎస్​ఎఫ్​లో​ 247 వేకెన్సీలకు నోటిఫికేషన్​.. ఇలా అప్లై చేసుకోండి!

BSF Head Constable Recruitment : బీఎస్​ఎఫ్​లో​ 247 వేకెన్సీలకు నోటిఫికేషన్​.. ఇలా అప్లై చేసుకోండి!

Sharath Chitturi HT Telugu
Apr 24, 2023 08:30 AM IST

BSF Head Constable Recruitment : బీఎస్​ఎఫ్​లో 247 వేకెన్సీలకు నోటిఫికేషన్​ పడింది. అప్లికేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

బీఎస్​ఎఫ్​ హెడ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ ప్రక్రియ మొదలు..
బీఎస్​ఎఫ్​ హెడ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ ప్రక్రియ మొదలు.. (PTI)

BSF Head Constable Recruitment 2023 : హెడ్​ కానిస్టేబుల్​ రేడియో ఆపరేటర్​, హెడ్​ కానిస్టేబుల్​ (రేడియో మెకానిక్​) పోస్టుల భర్తీకి.. రిక్రూట్​మెంట్​ ప్రక్రియను ప్రారంభించింది బీఎస్​ఎఫ్​ (బార్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​). బీఎస్​ఎఫ్​ అధికారిక వెబ్​సైట్​ rectt.bsf.gov.in లోకి వెళ్లి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫామ్​ను సబ్మీట్​ చేయడానికి మే 12 తుది గడువు అని గుర్తుపెట్టుకోవాలి.

బీఎస్​ఎఫ్​లో వేకెన్సీలు..

BSF Head Constable Recruitment 2023 apply online : ఈ దఫా రిక్రూట్​మెంట్​లో మొత్తం 247 వేకెన్సీలను భర్తీ చేయనుంది బీఎస్​ఎఫ్​. వీటిల్లో 217 ఖాళీలు రేడియో ఆపరేటర్​ హెడ్​ కానిస్టేబుల్​వి కాగా.. మరో 30 రేడియో మెకానిక్​ హెడ్​ కానిస్టేబుల్​వి ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు.. 2023 మే 12 నాటికి 18ఏళ్ల కన్నా తక్కువ ఉండకూడదు, 25ఏళ్ల కన్నా ఎక్కువ కూడా ఉండకూడదు.

బీఎస్​ఎఫ్​ హెడ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​- ఇలా అప్లై చేసుకోండి.

స్టెప్​ 1:- బీఎస్​ఎఫ్​ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోంపేజ్​లో గ్రూప్​-సీ హెడ్​ కానిస్టేబుల్​ రేడియో ఆపరేటర్​, హెడ్​ కానిస్టేబుల్​ రేడియో మెకానిక్​కి సంబంధించిన లింక్​ ఉంటుంది. దాని మీద క్లిక్​ చేయండి.

BSF Head Constable jobs : స్టెప్​ 3:- అప్లికేషన్​ ఫామ్​ను పూర్తి చేయండి.

స్టెప్​ 4:- సంబంధిత డాక్యుమెంట్​లను అప్లోడ్​ చేయండి.

స్టెప్​ 5:- అప్లికేషన్​ ఫీజు చెల్లించండి.

స్టెప్​ 6:- అప్లికేషన్​ ఫామ్​ను సబ్మీట్​ చేయండి.

స్టెప్​ 7:- అప్లికేషన్​ ఫామ్​ను ప్రింటౌట్​ తీసుకోండి.

2023 బీఎస్​ఎఫ్​ హెడ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

యూపీఎస్​సీ నోటిఫికేషన్..

UPSC recruitment 2023 : సూపర్​వైజర్​తో పాటు ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను జారీ చేసింది యూపీఎస్​సీ (యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమీషన్​). యూపీఎస్​సీ అధికారిక వెబ్​సైట్​ upsc.gov.in లోకి వెళ్లి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. 2023 మే 12తో అప్లికేషన్​ గడువు ముగియనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం