UPSC Recruitment 2023 : సూపర్​వైజర్​తో పాటు ఇతర పోస్టుల భర్తీకి యూపీఎస్​సీ నోటిఫికేషన్​..-upsc recruitment 2023 apply for supervisor and other posts at upscgovin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Recruitment 2023 : సూపర్​వైజర్​తో పాటు ఇతర పోస్టుల భర్తీకి యూపీఎస్​సీ నోటిఫికేషన్​..

UPSC Recruitment 2023 : సూపర్​వైజర్​తో పాటు ఇతర పోస్టుల భర్తీకి యూపీఎస్​సీ నోటిఫికేషన్​..

Sharath Chitturi HT Telugu
Apr 22, 2023 12:11 PM IST

UPSC Recruitment 2023 : సూపర్​వైజర్​తో పాటు పలు ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది యూపీఎస్​సీ. మే 12లోపు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

యూపీఎస్​సీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
యూపీఎస్​సీలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

UPSC Recruitment 2023 : సూపర్​వైజర్​తో పాటు ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను జారీ చేసింది యూపీఎస్​సీ (యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమీషన్​). యూపీఎస్​సీ అధికారిక వెబ్​సైట్​ upsc.gov.in లోకి వెళ్లి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. 2023 మే 12తో అప్లికేషన్​ గడువు ముగియనుంది. యూపీఎస్​సీ నోటిఫికేషన్​లోని ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

యూపీఎస్​సీలో వేకెన్సీలు..

అసిస్టెంట్​ సాయిల్​ కన్వర్షన్​ ఆఫీసర్​:- 2 పోస్టులు.

అడిషనల్​ అసిస్టెంట్​ డైరక్టర్​:- 3 పోస్టులు

UPSC Recruitment 2023 notification : సైటింస్ట్​ బీ:- 1 పోస్టు

సూపర్​వైజర్​ ఇన్​క్లూజివ్​ ఎడ్జ్యుకేషన్​ డిస్ట్రిక్ట్​:- 3 పోస్టులు.

మొత్తం మీద ఈసారి 9 పోస్టుల భార్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది యూపీఎస్​సీ.

అభ్యర్థుల అర్హత..

ఆయా పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న అభ్యర్థుల విద్యార్హతకు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక చేయండి.

అప్లికేషన్​ ఫీజు..

UPSC Recruitment 2023 notification pdf : ఎస్​బీఐ నెట్​ బ్యాంకింగ్​, వీసా/ మాస్టర్​ క్రెడిట్​/ డెబిట్​ కార్డ్​ల ద్వారా అభ్యర్థులు రూ. 25 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్​సీ/ఎస్​టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళలకు ఎలాంటి ఫీజు లేదు.

ఇతర వివరాలు..

అభ్యర్థలకు రిక్రూట్​మెంట్​ టెస్ట్​తో పాటు ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.

జేఈ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు..

UPSC Recruitment 2023 notification last date to apply : జూనియర్ ఇంజినీర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్​తో పాటు కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లోని ఇతర పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్.. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు త్వరలోనే (ఏప్రిల్ 27) ముగియనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 146 పోస్టులను యూపీఎస్​సీ భర్తీ చేస్తోంది. వేకెన్సీ వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సీడీఎస్ 2 ఫైనల్ ఫలితాలు..

UPSC CDS 2 results : కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2 2022 పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది యూపీఎస్​సీ. అభ్యర్థులు ఫలితాలను యూపీఎస్సీ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్ upsc.gov.in. లో ఫలితాలను చూసుకోవచ్చు. మొత్తం 204మంది అభ్యర్థులు ఈ 2022 యూపీఎస్​సీ సీడీఎస్ 2 పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం