TS DEECET 2023 : డీఈఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జూన్ 1న పరీక్ష-ts deecet notification 2023 has been released check key dates are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Deecet 2023 : డీఈఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జూన్ 1న పరీక్ష

TS DEECET 2023 : డీఈఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. జూన్ 1న పరీక్ష

HT Telugu Desk HT Telugu
Apr 22, 2023 11:13 AM IST

TS DEECET Notification 2023: డీఈఈసెట్‌ 2023 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించింది.

డీఈఈసెట్‌ 2023 నోటిఫికేషన్ విడుదల
డీఈఈసెట్‌ 2023 నోటిఫికేషన్ విడుదల

TS DEECET Notification 2023 Updates: తెలంగాణలో ఒక్కో ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. తాజాగా డీఈఈసెట్‌ 2023 ప్రకటన విడుదలైంది. జూన్‌ 1వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ డైట్‌ కాలేజీతోపాటు, ప్రైవేట్‌ డీఐఈడీ కాలేజీల్లోని డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ముఖ్య వివరాలకు http ://deecet.cdse.telangana.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

డీఈఈసెట్‌ నోటిఫికేషన్‌
డీఈఈసెట్‌ నోటిఫికేషన్‌

ముఖ్య వివరాలు:

ప్రవేశ పరీక్ష - డీఈఈసెట్‌ 2023

2023 -25 విద్యా సంవ‌త్స‌రానికి గానూ ప్రవేశాలు కల్పిస్తారు.

దరఖాస్తులు - ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులు ప్రారంభం- ఏప్రిల్ 22వ తేదీ

దరఖాస్తులకు తుది గడువు - మే,22వ తేదీ, 2023

పరీక్ష తేదీ - జూన్ 1, 2023.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో పరీక్ష నిర్వహించనున్నారు.

అధికారిక వెబ్ సైట్ - http : //deecet.cdse.telangana.gov. in

ఎడ్ సెట్ గడువు పొడిగింపు…

Telangana EdCET 2023 Updates: తెలంగాణ ఎడ్ సెట్ 2023 కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. బీఎడ్ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే తెలంగాణ ఎడ్‌సెట్ దర‌ఖాస్తు గ‌డువు పెంచారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ద‌ర‌ఖాస్తుల గ‌డువును ఏప్రిల్ 25వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ ఏ రామ‌కృష్ణ తెలిపారు. మే 18వ తేదీన ఎడ్ సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించున్నారు.

షెడ్యూల్ వివరాలు:

మార్చి 4 - ఎడ్‌సెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల.

మార్చి 6 - అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

దరఖాస్తు రుసుం - ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్య‌ర్థులు రూ. 500, ఇత‌ర కేట‌గిరీల అభ్య‌ర్థులు రూ. 700 చెల్లించాలి.

ఎలాంటి ఆల‌స్య రుసుం లేకుండా ఏప్రిల్ 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మార్చి 30- అభ్య‌ర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మే 5 - ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.

మే 18 - ఎడ్ సెట్ - 2023 ప్ర‌వేశ ప‌రీక్ష ఉంటుంది.

మే 21 - ప్రాథ‌మిక కీ విడుద‌ల చేస్తారు.

NOTE: తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తులు, హాల్ టికెట్లు, కీ, ఫలితాలను https://edcet.tsche.ac.in/ లింక్ పై క్లిక్ చేసి పొందవచ్చు.

WhatsApp channel