Gujarat election results: ముస్లిం డామినేటింగ్ సీట్లలోనూ బీజేపీ హవా-bjp gains even in muslim dominating seats in gujarat as aap aimim divide congress voters ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bjp Gains Even In Muslim Dominating Seats In Gujarat As Aap, Aimim Divide Congress Voters

Gujarat election results: ముస్లిం డామినేటింగ్ సీట్లలోనూ బీజేపీ హవా

HT Telugu Desk HT Telugu
Dec 08, 2022 02:58 PM IST

Gujarat election results: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. అధికార పార్టీ రికార్డు స్థాయిలో స్థానాలను గెలుచుకుంటోంది. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న సీట్లలోనూ బీజేపీ ఆధిక్యత చూపుతుండడం విశేషం.

గుజరాత్ లో బీజేపీ శ్రేణుల సంబురాలు
గుజరాత్ లో బీజేపీ శ్రేణుల సంబురాలు (REUTERS)

Gujarat election results: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో(Gujarat election results) బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. 182 సీట్ల అసెంబ్లీలో 154 స్థానాల్లో అధికార బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కు ఇన్నాళ్లు కంచుకోటగా ఉన్న సీట్లలోనూ బీజేపీ విజయం సాధిస్తుండడం ఈ ఎన్నికల ప్రత్యేకత.

ట్రెండింగ్ వార్తలు

BJP gains in Muslim dominated seats too: ముస్లిం సీట్లలోనూ బీజేపీ హవా

గుజరాత్ లో(Gujarat election results) ముస్లిం జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఈ సారి బీజేపీ విజయం సాధిస్తోంది. సంప్రదాయంగా ఈ స్థానాలు కాంగ్రెస్ కంచుకోటలు. ముస్లిం వర్గాలు ఇన్నాళ్లు కాంగ్రెస్ కు ఓటేస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఆప్, ఎంఐఎం పార్టీల ప్రవేశంతో ముస్లిం ఓట్లు చీలి, బీజేపీకి లాభిస్తోంది. గుజరాత్ లో దాదాపు 17 స్థానాల్లో ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో వాటిలో దాదాపు 12 సీట్లలో బీజేపీ ముందంజలో ఉంది. ఐదు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది.

No Muslim candidates in BJP; ఒక్క టిక్కెట్టూ ఇవ్వకపోయినా..

బీజేపీ ఈ ఎన్నికల్లో(Gujarat election results) ఏ ఒక్క ముస్లింకు కూడా టికెట్ ఇవ్వలేదు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న స్థానాల్లో కూడా వారికి అవకాశం కల్పించలేదు. అయినా, ఆ సీట్లలో బీజేపీ ఆధిక్యతలో ఉండడం విశేషం. ఇందుకు ప్రధాన కారణంగా ఆప్, ఎంఐఎం ల ప్రవేశమేనని విశ్లేషిస్తున్నారు. సంప్రదాయంగా కాంగ్రెస్ కు పడే ముస్లిం ఓట్లను ఈ సారి ఆప్, ఎంఐఎంలు చీల్చడంతో, ఆ మేరకు బీజేపీ బలపడింది. గత పదేళ్లుగా కాంగ్రెస్ బలంగా ఉన్న దరియాపూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కౌశిక్ జైన్ ఆధిక్యతలో ఉన్నారు.

AAP, AIMIM impact: కాంగ్రెస్ కు ఆప్, ఎంఐఎం దెబ్బ

గుజరాత్ ఎన్నికల్లో(Gujarat election results) ఆప్, ఎంఐఎం లు సొంతంగా బలపడడం కన్నా ఎక్కువగా బీజేపీకి ఉపయోగపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న ముస్లిం ఓట్లను ఈ రెండు పార్టీలు చీల్చాయని, అంటే, ముస్లిం వర్గాల ఓట్లు మొత్తంగా మూడు పార్టీలు.. కాంగ్రెస్, ఆప్, ఎంఐఎంల మధ్య చీలాయని విశ్లేషిస్తున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీట్లలో 16 స్థానాల్లో ఆప్ పోటీ చేసింది. ఎంఐఎం 13 సీట్లలో పోటీ చేసింది. ఈ రెండు పార్టీలు కూడా ఆయా స్థానాల్లో గణనీయ స్థాయిలో ఓట్లను సాధించలేక పోయాయి. కానీ, కాంగ్రెస్ కు పడాల్సిన ముస్లిం ఓట్లను చీల్చి, కాంగ్రెస్ ను దెబ్బతీసి, పరోక్షంగా బీజేపీకి సహకరించాయి.

WhatsApp channel