Modi 3.0 cabinet: ప్రధాని మోదీ 3.0 క్యాబినెట్ లో టాప్ 5 బిలియనీర్ మంత్రులు వీరే; టీడీపీ ఎంపీనే నంబర్ 1.
Modi 3.0 cabinet: ప్రధాని మోదీ 3.0 క్యాబినెట్ లోని మంత్రుల్లో 70 మంది లేదా 99 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. వీరి సగటు ఆస్తులు రూ.107.94 కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, కేంద్ర మంత్రివర్గంలో 28 మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Modi 3.0 cabinet: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని 72 మంది సభ్యుల కేంద్ర మంత్రివర్గంలో 28 మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల వాచ్ డాగ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. వారు తమపై హత్యాయత్నాలు, కిడ్నాప్, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నారని తమ అఫిడవిట్ లలో పేర్కొన్నారు. వీరిలో 19 మంది మంత్రులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ విశ్లేషించింది. వారిలో ఇద్దరు మంత్రులు తమపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు ప్రకటించారని ఏడీఆర్ తెలిపింది. వారు పశ్చిమ బెంగాల్ కు చెందిన శంతను ఠాకూర్, సుకాంత మజుందార్. రాష్ట్రపతి భవన్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ప్రభుత్వంలోని 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి సోమవారం శాఖలను కేటాయించారు.
99 శాతం కోటీశ్వరులు
ప్రధాని మోదీ కొత్త మంత్రివర్గంలోని 71 మంది మంత్రుల్లో 70 మంది (99 శాతం) కోటీశ్వరులే. 71 మంది మంత్రుల సగటు ఆస్తులు రూ.107.94 కోట్లు. ఆరుగురు మంత్రులకు రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో బీజేపీ నుండి 61 మంది, ఎన్డిఎ మిత్రపక్షాల నుండి 11 మంది మంత్రులు ఉన్నారు. 72 మంది మంత్రుల్లో 43 మంది మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 39 మంది గతంలో కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు.
టీడీపీ ఎంపీ అత్యంత సంపన్న ఎంపీ
మోదీ మంత్రివర్గంలో అత్యంత ధనిక మంత్రి, టీడీపీ నుంచి లోక్ సభకు ఎన్నికైన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఆయనను గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖకు సహాయ మంత్రిగా నియమించారు. ఆ తరువాత స్థానంలో జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. ఆయన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న హెచ్ డీ కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అశ్వని వైష్ణవ్ రైల్వే, ఐ అండ్ బీ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రిగా ఉన్నారు. ఐదో స్థానంలో ఉన్న పీయూష్ గోయల్ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఈ మంత్రుల ఆస్తులను ఏడీఆర్ లెక్కించింది.
Minister | Party | Total Assets |
---|---|---|
Dr Chandra Sekhar Pemmasani | TDP | ₹5705 Crore+ |
Jyotiraditya M. Scindia | BJP | ₹425 Crore+ |
HD Kumaraswamy | JD(S) | ₹217 Crore+ |
Ashwini Vaishnaw | BJP | ₹144 Crore+ |
Rao Inderjit Singh | BJP | ₹121 Crore+ |
Piyush Goyal | BJP | ₹110 Crore+ |