Crime news : షాకింగ్​.. భార్యతో పాటు ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి చంపి..-bihar man on the run after slitting throats of his wife and their three minor daughters ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : షాకింగ్​.. భార్యతో పాటు ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి చంపి..

Crime news : షాకింగ్​.. భార్యతో పాటు ముగ్గురు కూతుళ్ల గొంతు కోసి చంపి..

Sharath Chitturi HT Telugu
Mar 30, 2024 07:20 AM IST

Man kills wife in Bihar : మగబిడ్డను కనలేకపోయిందన్న కారణంతో.. ఓ వ్యక్తి, తన భార్యను కిరాతకంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా.. తన ముగ్గురు కూతుళ్లను కూడా హత్య చేశాడు! ఈ ఘటన బిహార్​లో జరిగింది.

మగబిడ్డ పుట్టలేదని.. భార్య, ముగ్గురు కూతుళ్లను చంపిన వ్యక్తి!
మగబిడ్డ పుట్టలేదని.. భార్య, ముగ్గురు కూతుళ్లను చంపిన వ్యక్తి!

Man kills wife and daughters in Bihar : బిహార్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి.. తన భార్య, ముగ్గురు ఆడబిడ్డలను చంపేశాడు. అతను అప్పటికే ఒకరిని చంపి, బెయిల్​పై జైలు నుంచి బయటకి వచ్చాడు!

ఇదీ జరిగింది..

బిహార్​ చంపారణ్​ జిల్లాలో జరిగింది ఈ ఘటన. నిందితుడి పేరు ఇదు మియాన్​. అతని వయస్సు 50ఏళ్లు. అతని భార్య పేరు అఫ్రీన్​ ఖాతున్​. ఆమె వయస్సు 40ఏళ్లు. వారికి ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు. వారి పేర్లు.. అర్బున్​ ఖాతున్​ (15), షబ్రున్​ ఖాతున్​ (12), షెహ్​బాజ్​ ఖతున్​ (9).

కాగా.. మగబిడ్డ కావాలనుకున్న ఇదు మియాన్​కు.. ముగ్గురూ ఆడబిడ్డలే పుట్టడంతో అతను నిరాశచెందాడు. ఇదే విషయంపై చాలా సంవత్సరాలుగా భార్యను హింసిస్తూ వచ్చినట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం.. గురువారం రాత్రి ఈ గొడవ ముదిరింది. కోపంతో ఊగిపోయిన నిందితుడు.. భార్యను గొంతు కోసి చంపేశాడు. అనంతరం.. తన ముగ్గురు ఆడబిడ్డలను సైతం గొంతు కోసి, హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

Man kills wife in Bihar : శుక్రవారం.. ఆ ఇంటివైపు నుంచి వెళుతున్న స్థానికులకు.. నేల మీద రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వెళ్లి పోలీసులు.. ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. ఓ మహిళ, ముగ్గురు పిల్లల మృతదేహాలు కనిపించాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అదే సమయంలో.. అతడి గురించి వివరాలు సేకరిస్తుండగా.. కొన్ని షాకింగ్​ విషయాలు బయటపడ్డాయి.

ఇదు మియాన్​పై హత్య కేసు..

పోలీసుల సమాచారం ప్రకారం.. ఇదు మియాన్​కు రెండుసార్లు పెళ్లైంది. మొదటి భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. వారికి ఇద్దరు మగబిడ్డలు ఉన్నారు. మొదటి భార్య మరణంతో.. రెండో పెళ్లి చేసుకున్నాడు ఇదు మియాన్​. రెండో భార్యతో అతనికి ఐదుగురు ఆడబిడ్డలు పుట్టారు. మొదటి బిడ్డకు పెళ్లి జరిగింది.

Bihar crime news : కాగా.. 2017లో తన 16ఏళ్ల కూతురును చంపేశాడు ఇదు మియాన్​. ఉత్తర్​ ప్రదేశ్​ సీతాపూర్​కు సమీపంలో రైలులో నుంచి బయటకు తోసేసి చంపేశాడు. ఈ ఘటనలో అతనికి జైలు శిక్షపడింది. ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత.. 2022లో బెయిల్​పై బయటకి వచ్చాడు. తాజాగా.. తన భార్య, ముగ్గురు ఆడబిడ్డలను హత్య చేశాడు.

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

సంబంధిత కథనం