Goa crime news: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన రష్యన్; పరారీలో నిందితుడు-6yrold child allegedly raped by russian national in goa flees country police ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Goa Crime News: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన రష్యన్; పరారీలో నిందితుడు

Goa crime news: ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన రష్యన్; పరారీలో నిందితుడు

HT Telugu Desk HT Telugu
Feb 21, 2024 01:06 PM IST

Goa crime news: ఫిబ్రవరి 4, 5 తేదీల మధ్య రాత్రి గోవా సమీపంలోని అరాంబోల్ లో ఏర్పాటు చేసిన నైట్ క్యాంప్ లో రష్యాకు చెందిన నిందితుడు ఆరేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అనంతరం, మర్నాడు ఆ రష్యన్ దేశం విడిచి పారిపోయాడు.

ఆరేళ్ల బాలికపై రష్యన్ అత్యాచారం
ఆరేళ్ల బాలికపై రష్యన్ అత్యాచారం

Goa crime news: ఉత్తర గోవాలోని అరంబోల్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై రష్యా జాతీయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి 4, 5 తేదీల మధ్య రాత్రి అరంబోల్ లో నిర్వహించిన శిబిరంలో నిందితుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫిబ్రవరి 19న చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ రష్యన్ ఘటన జరిగిన మర్నాడే దేశం విడిచి పారిపోయాడని తేలింది.

కేసు నమోదు

ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆరోపణలపై రష్యా దేశీయుడైన ఇలియా వసులేవ్ పై ఐపీసీ సెక్షన్ 376, గోవా చిల్డ్రన్స్ యాక్ట్ (చైల్డ్ అబ్యూజ్) సెక్షన్ 8, లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం (పోక్సో) సెక్షన్ 4, 8 ల కింద కేసు నమోదు చేశారు. ‘‘ఫిర్యాదుదారుని మైనర్ కుమార్తెను అనుచితంగా తాకి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో, ఆ రష్యన్ పై కేసు నమోదు చేశాం" అని రాష్ట్ర మహిళా పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 4 రాత్రి ఉత్తర గోవాలోని అరంబోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన నైట్ క్యాంప్ లో పాల్గొన్న ఆ బాలికపై రష్యన్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత తన తల్లిదండ్రులకు చెప్పిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు రష్యా అధికారుల సాయం తీసుకోనున్నారు.