Alexei Navalny : ‘పుతిన్ నా భర్తను చంపేశాడు’- నావల్నీ భార్య
Alexei Navalny how did he die : అలెక్సీ నావల్నీ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన భార్య యూలియా. రష్యా అధ్యక్షుడు పుతిన్.. తన భర్తను చంపేశారని ఆరోపించారు.
Alexei Navalny wife : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుల్లో ఒకరు, విపక్ష నేత అయిన అలెక్సీ నావల్నీ అనుమానాస్పద మరణం.. ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. ఆయన మరణ వార్త బయట వచ్చిన మూడు రోజులకు.. నావల్నీ భార్య యూలియా నావల్నీ.. మీడియాతో మాట్లాడారు. పుతిన్.. తన భర్తను చంపేశారని ఆరోపించారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
"మూడు రోజుల క్రితం.. నా భర్తను పుతిన్ చంపేశారు. అలెక్సీని చంపేసి.. పుతిన్ నాలో సగ భగాన్ని చంపేశారు. నా గుండెని సగం చంపేశారు. నా ఆత్మను సగం చంపేశారు. కానీ నా దగ్గర ఇంకో సగం ఉంది. నేను పోరాడటాన్ని ఆపను. అలెక్సీ నావల్నీ ఆశయాల కోసం నేను పోరాడతాను," అని అంతర్జాతీయ వార్త సంస్థ అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు యూలియా నావల్నీ.
అలెక్సీ నావల్నీ ఎలా మరణించారు? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే.. తన భర్తను పుతిన్ మనుషులు.. 'నావిచోక్' అనే ప్రమాదకరమైన నర్వ్ ఏజెంట్ ఇచ్చి హత్య చేశారని యూలియా ఆరోపించారు. అది శరీరం నుంచి మాయమయ్యేందుకు అధికారులు ఎదురుచూస్తున్నారని, అందుకే తమకు ఇంకా నావల్నీ మృతదేహాన్ని కూడా ఇవ్వలేదని తెలిపారు.
Alexei Navalny how did he die : ఈ నేపథ్యంలో.. రష్యాలో పరిస్థితులపై వ్యాఖ్యానించారు అలెక్సీ నావల్నీ భార్య యూలియా నావల్నీ.
"స్వేచ్ఛాయుత రష్యాలో బతకాలని నాకు ఉంది. స్వేచ్ఛాయుత రష్యాను నిర్మించాలని ఉంది. ప్రజలరా.. నాతో కలిసి రండి. మీ కోపాన్ని, బాధని నాతో పంచుకోండి. మన భవిష్యత్తును నాశనం చేస్తున్న వారిపై కోపాన్ని బయటపెట్టండి," అని అలెక్సీ నావెల్నీ తెలిపారు.
నావల్నీ ఎలా మరణించారు?
Alexei Navalny Putin : 47ఏళ్ల అలెక్సీ నావల్నీ అరెస్ట్ అయ్యి చాలా సంవత్సరాలు గిడిచిపోయాయి. హై సెక్యూరిటీతో కూడిన ఖార్ప్ జైలులో ఆయనని ఉంచారు. అది మాస్కోకు 1,900 కి.మీల దూరంలో ఉంటుంది. వేర్పాటువాద ఆరోపణలతో ఆయనకు 19ఏళ్ల జైలు శిక్షపడింది.
నావల్నీని పుతిన్ చంపేశారా? అని అనుమానాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో.. అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని.. ఆయన కుటుంబానికి ఇంకా అప్పగించకపోవడంతో.. అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. నావెల్నీ మృతదేహంపై కెమికల్ ఎగ్జామినేషన్ జరుపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇంకో 14 రోజుల పాటు ఆయన మృతదేహం.. కుటుంబానికి అందకపోవచ్చు అని సమాచారం.
పుతిన్ బృందం మాత్రం.. అలెక్సీ నావల్నీ ఆరోగ్యం దెబ్బతిందని, కళ్లు తిరిగి పడిపోయి మరణించారని, వైద్య బృందం ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారని ఓ స్టేట్మెంట్ ఇచ్చింది.
సంబంధిత కథనం