Swiggy : డెలివరీ బాయ్​కి కన్నడ రాదని స్విగ్గీపై మహిళ ఆగ్రహం- నెటిజన్లు విమర్శలు..-bengaluru woman criticises swiggy as delivery agent did not know kannada ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Swiggy : డెలివరీ బాయ్​కి కన్నడ రాదని స్విగ్గీపై మహిళ ఆగ్రహం- నెటిజన్లు విమర్శలు..

Swiggy : డెలివరీ బాయ్​కి కన్నడ రాదని స్విగ్గీపై మహిళ ఆగ్రహం- నెటిజన్లు విమర్శలు..

Sharath Chitturi HT Telugu
Sep 15, 2024 08:10 AM IST

Bengaluru swiggy deilivery boy : డెలివరీ పర్సన్ కన్నడ మాట్లాడనందుకు స్విగ్గీని విమర్శిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదానికి దారి తీసింది. “మీరు తినేటప్పుడు డెలివరీ బాయ్​ని మీ పక్కన కూర్చోపెట్టుకుని చాట్​ చేస్తార?” అని నెటిజన్లు సైటర్​ వేస్తున్నారు.

డెలివరీ బాయ్​కి కన్నడ రావడం లేదని మహిళ విమర్శలు..
డెలివరీ బాయ్​కి కన్నడ రావడం లేదని మహిళ విమర్శలు..

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో బెంగళూరు మహిళ చేసిన పోస్ట్ వివాదానికి దారి తీసింది. కన్నడ భాష రాని స్విగ్గీ డెలివరీ పర్సన్ అంటూ ఆ మహిళ తన పోస్టులో మండిపడింది. ఈ పోస్ట్​ వైరల్​గా మరింది. నెటిజన్లు మహిళపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ జరిగింది..

బెంగళూరులో స్విగ్గీ సేవలను రేఖ అనే మహిళ ప్రశ్నించారు. డెలివరీ ఏజెంట్ కన్నడ, ఇంగ్లిష్ మాట్లాడడం లేదని, స్థానికులు హిందీ అర్థం చేసుకుంటారని ఆశించడం సమంజసం కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

“బెంగళూరు కర్ణాటకలో ఉందా లేక Pakistan@Swiggy? మీ డెలివరీ బాయ్ #kannada మాట్లాడటం లేదు, అర్థం చేసుకోవడం లేదు, కనీసం #English కూడా లేదు. #Hindi మనం నేర్చుకోవాలని మీరు ఆశిస్తున్నారా? భాషని మాపై రుద్దడం ఆపండి. మీ డెలివరీ పార్ట్​నర్​ #Kannada నేర్చుకునేలా చూడండి,” అని సదరు మహిళ ట్వీట్​ చేశారు.

వైరల్ పోస్ట్​పై కామెంట్లు..

డెలివరీ బాయ్​కి కన్నడ రాదంటూ మహిళ చేసిన పోస్ట్ వైరల్​గా మారింది. ఎక్స్​లో 315.5కే వ్యూస్, 1.6కే కామెంట్స్ వచ్చాయి. డెలివరీ సిబ్బంది అన్ని ప్రాంతీయ భాషలు మాట్లాడాలని ఆశించరాదని యూజర్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:- ‘జూస్​లో మూత్రం పోసి అమ్ముతున్నారు’.. ఇద్దరిపై దాడి- వీడియో వైరల్​!

ఇండియాలో ప్రతి 50 కిలోమీటర్లకు భాష మారుతుందని, కానీ తమిళం, కన్నడ భాషల విషయంలో ఉన్నంత కఠినంగా మరెవ్వరూ లేరని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. భారతదేశం భిన్నత్వం కలిగిన దేశమని, అనేక భాషలు ఉన్నాయని, అన్ని భాషలను గౌరవించాలని అంటున్నారు.

'డెలివరీ బాయ్ తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది?' అని ఒకరు ప్రశ్నించారు.

"డెలివరీ సమయానికి పూర్తయినంత కాలం డెలివరీ బాయ్ భాషా నైపుణ్యాల గురించి ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు," అని ఇంకొకరు కామెంట్​ చేశారు.

"మీరు తినేటప్పుడు డెలివరీ బాయ్ మీతో కూర్చుని చాట్ చేయాలని మీరు ఆశిస్తున్నారా?" అని మరొకరు సైటర్​ వేశారు.

వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. హిందీని రుద్దుతున్నారంటూ తమిళనాడు, కర్ణాటకలో చాలా మంది ప్రజలు మండిపడుతున్నారు.

ఈ ఘటనపై మీ స్పందన ఏంటి? డెలివరీ బాయ్​కి స్థానిక భాష రావాల్సిన అవసరం ఉందా?

సంబంధిత కథనం