Bengaluru Fridge Case : బెంగళూరు మహిళ హత్యలో ప్రేమికుడి పాత్ర.. అనుమానం వ్యక్తం చేసిన భర్త-bengaluru fridge case mahalakshmi husband suspects lover role in murder details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Fridge Case : బెంగళూరు మహిళ హత్యలో ప్రేమికుడి పాత్ర.. అనుమానం వ్యక్తం చేసిన భర్త

Bengaluru Fridge Case : బెంగళూరు మహిళ హత్యలో ప్రేమికుడి పాత్ర.. అనుమానం వ్యక్తం చేసిన భర్త

Anand Sai HT Telugu
Sep 24, 2024 09:08 AM IST

Bengaluru Fridge Case : బెంగళూరులో మహాలక్ష్మీ అనే మహిళను చంపి ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా బాధితురాలి భర్త స్పందించారు. ఈ హత్యలో తన భార్య ప్రేమికుడి పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

బాధితురాలు మహాలక్ష్మీ
బాధితురాలు మహాలక్ష్మీ

బెంగళూరులో మహిళ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. మహాలక్ష్మీ అనే వ్యక్తిని చంపి ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టారు. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయింది. నిందితుడిని గుర్తించినట్టుగా ఇప్పటికే పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ హత్యపై తాజాగా మహాలక్ష్మీ భర్త హేమంత్ దాస్ స్పందించాడు.

తన భార్య అక్రమ సంబంధం కలిగి ఉందని పేర్కొన్నాడు భర్త. ఈ హత్యలో ఉత్తరాఖండ్‌కు చెందిన ఆమె ప్రేమికుడు ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసినట్టుగా ఇండియా టుడే పేర్కొంది. హేమంత్ దాస్ దాస్ ఇప్పటికే అతడి గురించి పోలీస్ స్టేషన్‌లో చాలా నెలల క్రితం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

'నేను అతనిపై ఒకసారి నెలమంగళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు తర్వాత అతను బెంగళూరుకు రాకూడదని ఆదేశాలు వచ్చాయి. కానీ వారు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు.' అని హేమంత్ దాస్‌ చెప్పాడు.

29 ఏళ్ల మహిళను నరికి ఫ్రిజ్‌లో ముక్కలుగా చేసి పెట్టిన కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ బి.దయానంద సోమవారం తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ప్రధాన నిందితుడిని గుర్తించామని, అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటించారు.

బాధితురాలు మహాలక్ష్మీ మల్లేశ్వరంలోని ఓ మాల్‌లో పనిచేస్తుంది. తన భర్తకు దూరంగా జీవిస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని గుర్తించడానికి 4-5 రోజుల ముందు నేరం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త కూడా సంఘటనా స్థలానికి వచ్చాడు.

ఆదివారం తెల్లవారుజామున ఆమె తల్లి, సోదరితో సహా బాధితురాలి కుటుంబం మృతదేహాన్ని కనుగొంది. ఈ షాకింగ్ వీడియో బయటపడింది. 44 సెకన్ల క్లిప్‌లో గదిలోకి వారు ప్రవేశించడం కనిపించింది. ఫ్రిజ్‌ను తెరిచి చూడగా మహాలక్ష్మిని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉంది. ఈ విషయం గమనించగానే కుటుంబ సభ్యులు షాక్‌కు గురై ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు.