Kota rape case : యువతిపై గ్యాంగ్ రేప్.. నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న బాధితురాలు!
Rajasthan Rape case : రాజస్థాన్‌లో 18ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం.. ఆమె నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకుంది.

Kota crime news : రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి.. సామూహిక అత్యాచారానికి గురైంది. కొందరు ఆమెను ఇంట్లో నుంచి కిడ్నాప్ చేసి రేప్ చేశారు. అనంతరం.. ఆ యువతి.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది!
ఇదీ జరిగింది..
రాజస్థాన్ కోటాలో గురువారం రాత్రి జరిగింది ఈ ఘటన. బాధితురాలి వయస్సు 18ఏళ్లు. గురువారం రాత్రి.. కుటుంబం నిద్రిస్తుండగా.. కొందరు ఇంట్లోకి ప్రవేశించారు. యువతిని కిడ్నాప్ చేసి, సమీపంలోని షాప్‌లోకి తీసుకెళ్లారు. ఒకరు బయట కాపాలా కాస్తుండగా.. మిగిలిన నలుగురు.. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Girl gang raped in Rajasthan : కొంతసేపటికి.. ఇంట్లో ఒకరు.. మంచి నీరు తాగడానికి నిద్రలేచారు. యువతి కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. బయటకు వెళ్లి చూడగా.. సమీప దుకాణం నుంచి అరుపులు వినిపించాయి. అతను అటువైపు పరుగులు తీశాడు. కానీ.. షాపు బయట కాపాలా కాస్తున్న వ్యక్తి.. అతడిని దారుణంగా కొట్టాడు. కానీ ఎలాగో అలా.. షాపు డోర్‌ని ఓపెన్ చెయ్యగలిగాడు. లోపలి నుంచి ఆ యువతి.. ఏడుస్తూ బయటకు పరుగులు తీసింది.
అనంతరం.. ఆమె ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్లి, గది డోర్‌ని లాక్ చేసుకుంది. శరీరానికి నిప్పింటించుకుంది. తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లిన కుటుంబసభ్యులు.. మంటలను అదుపుచేశారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ.. గాయాల కారణంగా ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.
Rajasthan crime news : ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. ఆసుపత్రికి వెళ్లిన పోలీసులు.. బాధితురాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి నుంచి ఫిర్యాదు తీసుకుని నిందితులపై సెక్షన్ 376 డీ, 366, 306 కింద కేసులు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
గాలింపు చర్యల అనంతరం.. ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారు.. ఆ యువతి బంధువులని తెలుస్తోంది. మరో ముగ్గురిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు.
మరోవైపు.. సామూహిక అత్యాచారం అనంతరం బాధితురాలు ఆత్మహత్య చేసుకుందన్న వార్త.. స్థానికంగా కలకలం సృష్టించింది. ఆమె కుటుంబానికి ప్రజలు సానుభూతి తెలుపుతున్నారు. నిందితులను వెంటనే పట్టుకుని, వారిని కఠినంగా శిక్షిచాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో ఆరేళ్ల చిన్నారిపై..
6 year old raped in Telangana : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. చిన్నారులు, బాలికలు, మహిళలు రేప్‌నకు గురవుతున్నారు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన.. తాజాగా తెలంగాణలో కలకలం సృష్టించింది. పెద్దపల్లి జిల్లాలో ఈ దారుణం జరిగింది. అభం శుభం తెలియని ఆరేళ్ల పాపను వలస కార్మికుడు ఎత్తుకెళ్లి అఘాహిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడి అనంతరం గొంతునులిమి ప్రాణం తీశాడు. పసిపాపను చెరిసి ప్రాణం తీసిన కామాంధుడిని ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తు ఆందోళన దిగారు. పోలీసులు రంగంలోకి దిగి కామాంధుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి లో మమత రైస్ మిల్లులో జరిగిన ఈ ఘటన సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. ఆసిఫాబాద్ జిల్లా దాహేగాం కు చెందిన సాహితి- మహేష్ దంపతులు నెలరోజుల క్రితం ఇద్దరు ఆడపిల్లలతో కలిసి కాట్నపల్లికి చేరుకుని రైస్ మిల్లులో పనిచేస్తున్నారు. అదే రైస్ మిల్లులో హామాలీ పనిచేసే ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కార్మికుడు బలరాం కన్ను మహేష్ పెద్దకూతురు ఆరేళ్ల పాప సహస్ర పై పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.