Bengaluru fridge case : ‘నా జీవితాన్ని నాశనం చేసింది.. అందుకే చంపెశా’- మహాలక్ష్మి కేసు నిందితుడు!-bengaluru fridge case accused confessed murder to his mother before suicide ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Fridge Case : ‘నా జీవితాన్ని నాశనం చేసింది.. అందుకే చంపెశా’- మహాలక్ష్మి కేసు నిందితుడు!

Bengaluru fridge case : ‘నా జీవితాన్ని నాశనం చేసింది.. అందుకే చంపెశా’- మహాలక్ష్మి కేసు నిందితుడు!

Sharath Chitturi HT Telugu
Sep 27, 2024 07:20 AM IST

Bengaluru fridge case : బెంగళూరు మహాలక్ష్మి కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకోగా, దాని కన్నా ముందు నేరన్ని తన కుటుంబసభ్యుల వద్ద ఒప్పుకున్నాడు. ఆ మహిళ తన జీవితాన్ని నాశనం చేసిందని, అందుకే కోపంతో చంపేశానని వివరించాడు.

బెంగళూరు మహాలక్ష్మి కేసులో కీలక విషయాలు..
బెంగళూరు మహాలక్ష్మి కేసులో కీలక విషయాలు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరు మహాలక్ష్మి కేసులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితుడు ఆత్మహత్య చేసుకోగా, అంతకుముందు.. తన కుటుంబసభ్యుల వద్ద నేరాన్ని అంగీకరించాడు! ఆ మహిళ తన జీవితాన్ని నాశనం చేసిందని, అందుకే కోపంతో చంపేశానని, నిందితుడు తన కుటుంబసభ్యులకు చెప్పాడు.

ఇదీ జరిగింది..

బెంగళూరులో ఓ ముక్కలు ముక్కలుగా నరికిన ఓ మహిళ మృతదేహం, ఓ ఇంటి ఫ్రిడ్జ్​లో కనిపించింది. ఈ వార్త సంచలనం సృష్టించింది. మహిళ పేరు మహాలక్ష్మి అని తేలింది. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా నిందితుడు ఒడిశాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై నిందితుడు సోదరుడు పలు కీలక విషయాలను వెల్లడించాడు.

"గత 9-10 రోజులు నా సోదరుడు మా దగ్గరే ఉన్నాడు. మహాలక్ష్మిని చంపినట్టు, వచ్చిన మూడో రోజే ఒప్పుకున్నాడు. ఆమె తనని బ్లాక్​మెయిల్​ చేసి, డబ్బులు వసూలు చేసేదని చెప్పాడు," అని నిందితుడి సోదరుడు చెప్పాడు. "నా జీవితాన్ని నాశనం చేసింది. నా కుటుంబాన్ని నాశనం చేసింది," అని తన సోదరుడు తనకు చెప్పినట్టు అతను వెల్లడించాడు.

"నా సోదరుడు ఆమెని పెళ్లి చేసుకుందామని భావించాడు. బైక్​ మీద కేరళకు తీసుకెళ్లాలని ప్లాన్​ చేశాడు. కానీ తనని కిడ్నాప్​ చేశాడని ఆమె చెప్పి, అందరి చేత కొట్టించింది. ప్రజలు నా సోదరుడిని దారుణంగా కొట్టి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు కూడా కొట్టి, రూ. 1000 లంచం తీసుకుని వదిలేశారు. ఆ మహిళ, ఆమె, తన స్నేహితులు దారుణంగా కొట్టారు. కోపంతో ఆమె గొంతు పట్టుకుని నులిమాడు. ఆమె చనిపోయింది. అది తెలుసుకుని సూసైడ్​గా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాడు. అది కూదరకపోవడంతో మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్​లో పెట్టి ఒడిశాకు వచ్చేశాడు," అని నిందితుడి సోదరుడు చెప్పాడు.

29ఏళ్ల మహాలక్ష్మికి హేమంత్​ దాస్​ అనే వ్యక్తితో వివాహమైంది. కానీ పెళ్లి బంధంలో సమస్యల కారణంగా 9 నెలల క్రితం కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ ఆమె బెంగళూరుకు వచ్చింది. అప్పుడే ఆమెకు ఒక మాల్​లో ఉద్యోగం వచ్చింది. అక్కడ నిందితుడిని కలుసుకుంది.

బెంగళూరు మహాలక్ష్మి కేసు వెలుగులోకి వచ్చిన ఐదో రోజులకు, ఒడిశా భద్రక్​ జిల్లాలో నిందితుడు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

"తన ప్రవర్తనతో విసుగెత్తిపోయాను. వ్యక్తిగత విషయాలపై గొడవ జరిగేది. ఆమె నాపై దాడి చేసింది. సెప్టెంబర్​ 3న ఆమెని కోపంతో చంపేశాను," అని నిందితుడు రాసిన లెటర్​లో ఉంది.

ఆత్మహత్యకు ముందు నిందితుడు తన తల్లిని కలిశాడు.

"మంగళవారం రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. చాలా టెన్షన్​గా కనిపించాడు. ఏదో తప్పు చేసినట్టు చెప్పాడు. బెంగళూరులో ఒక మహిళను చంపినట్టు ఒప్పుకున్నాడు. వాస్తవానికి 2-3ఏళ్లుగా మా కుమారుడు మాతో మాట్లాడటం లేదు. జీవితంలో ఏం జరుగుతోందో ఎప్పుడు చెప్పలేదు. కానీ మహిళను చంపినట్టు చెప్పాడు. తనని తాను రక్షించుకునేందుకు, ఆ మహిళను చంపినట్టు చెప్పాడు," అని నిందితుడు తల్లి మీడియాకు చెప్పింది.

సంబంధిత కథనం