Brahmin genes: కండలు చూపుతూ ‘బ్రాహ్మిణ్ జీన్స్’ అన్న కాప్షన్ తో పోస్ట్ పెట్టి వివాదాస్పదమైన మహిళా సీఈఓ-bengaluru ceo flexes brahmin genes in controversial post slammed as casteist ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Brahmin Genes: కండలు చూపుతూ ‘బ్రాహ్మిణ్ జీన్స్’ అన్న కాప్షన్ తో పోస్ట్ పెట్టి వివాదాస్పదమైన మహిళా సీఈఓ

Brahmin genes: కండలు చూపుతూ ‘బ్రాహ్మిణ్ జీన్స్’ అన్న కాప్షన్ తో పోస్ట్ పెట్టి వివాదాస్పదమైన మహిళా సీఈఓ

HT Telugu Desk HT Telugu
Aug 24, 2024 08:28 PM IST

Brahmin genes: బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ సీఈఓ అనురాధ తివారీ తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం వివాదాస్పదమైంది. దీనిపై నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘ఎక్స్’ లో పెట్టిన తన ఫొటోకు 'బ్రాహ్మణ జన్యువులు' అనే క్యాప్షన్ ఇచ్చి ఆమె వివాదానికి తెరలేపారు.

‘బ్రాహ్మిణ్ జీన్స్’ అన్న కాప్షన్ తో పోస్ట్ పెట్టి వివాదాస్పదమైన ఓ స్టార్టప్ సీఈఓ
‘బ్రాహ్మిణ్ జీన్స్’ అన్న కాప్షన్ తో పోస్ట్ పెట్టి వివాదాస్పదమైన ఓ స్టార్టప్ సీఈఓ (X/@talk2anuradha)

Brahmin genes: బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సీఈఓ అనురాధ తివారీ 'బ్రాహ్మణ జన్యువులు' అనే క్యాప్షన్ తో ‘ఎక్స్’ లో ఒక ఫొటో పోస్ట్ చేసి వివాదానికి తెరలేపారు. కంటెంట్ రైటింగ్ కంపెనీ అయిన ‘జస్ట్ బర్స్ట్ అవుట్’ కు అనురాధ తివారీ సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

కండలు చూపుతూ..

అనురాధ తివారీ తన చేతి కండలు చూపుతూ ఒక ఫొటోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (X) లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కు ఇంగ్లీష్ లో ‘బ్రాహ్మిణ్ జీన్స్’ అనే కాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఆ క్యాప్షన్ వివాదస్పదమైంది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఆమె పెట్టిన పోస్ట్ ల్లో ఇదే అత్యంత వివాదాస్పదమైన పోస్ట్ గా మారింది. ఈ పోస్ట్ ఒక్క రోజులోనే 1.3 మిలియన్ వ్యూస్ సాధించింది.

యాంటి రిజర్వేషన్ యాక్టివిస్ట్

రిజర్వేషన్ సిస్టమ్ ను వ్యతిరేకిస్తూ అనురాధ తివారీ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతుంటారు. కుల ఆధారిత రిజర్వేషన్లను తొలగించాలని గట్టిగా వాదిస్తుంటారు. "ఒకే కుటుంబం, ఒకే రిజర్వేషన్" అనే నినాదాన్ని తాను విశ్వసిస్తున్నానని ఆమె తన ఎక్స్ బయోలో రాసుకున్నారు. అనురాధ తివారీ టెడెక్స్ స్పీకర్ కూడా. ఆమె గతంలో కుల ఆధారిత రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ పలు పోస్ట్ లు పెట్టారు.

రిజర్వేషన్లతో నష్టపోయాను..

‘‘నేను జనరల్ కేటగిరీ విద్యార్థిని. నా పూర్వీకులు నాకు 0.00 ఎకరాల భూమి ఇచ్చారు. నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. నేను 95% మార్కులు సాధించినప్పటికీ అడ్మిషన్ పొందలేకపోయాను. కానీ 60% మార్కులు సాధించిన, సంపన్న కుటుంబం నుంచి వచ్చిన నా క్లాస్ మేట్ కు రిజర్వేషన్ (reservations) వల్ల అడ్మిషన్ లభించింది. కానీ, మీరేమో రిజర్వేషన్ల విషయంలో నాకేంటి సమస్య అని నన్ను అడుగుతున్నారు’’ అని తివారీ ఆగస్టు 2022 నాటి ఒక పోస్ట్ లో రాశారు.

జనరల్ కేటగిరీ వాళ్లు ఏకం కావాలి..

జనరల్ కేటగిరీ వారంతా అయిదేళ్లలో ఏకం అయి ఉద్యమించాలని ఇటీవల ఆమె పిలుపునిచ్చారు. అలా చేయకపోతే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పిస్తారని హెచ్చరించారు. ఏదేమైనా, "బ్రాహ్మణ జన్యువులు" పై ఆమె చేసిన పోస్ట్ ఇప్పటి వరకు అత్యంత వివాదాస్పదంగా మారింది. వందలాది మంది సోషల్ మీడియా యూజర్లు తివారీని కులవాదిగా విమర్శించారు.

మనుస్మృతి ఫాలో కండి..

‘‘కులతత్వం ఇంకా ఉందనడానికి ఇదే ఉదాహరణ. ఫిట్ గా ఉండటం మంచిదే కానీ, దానికి పై స్థాయి కులం వల్ల వచ్చిన జన్యువులే కారణం అనడం సరికాదు. వన్ ఫ్యామిలీ.. వన్ నేషన్ కు ఇది మార్గం కాదు’’ అని సుప్రీంకోర్టు (Supreme court) న్యాయవాది శశాంక్ రత్నూ రాశారు. ‘‘తన కులాన్ని ప్రచారం చేసుకుంటూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఎంత విలక్షణమైన విషయం’’ అని మరొకరు పేర్కొన్నారు. ‘‘మనుస్మృతి ప్రకారం అమ్మాయిలు ఎల్లవేళలా ఇంట్లోనే ఉండాలి. భర్తలను జాగ్రత్తగా చూసుకోవాలి. మరేమీ చేయొద్దు. కానీ రాజ్యాంగం కారణంగా మీరు ట్విటర్ వేదికగా మీదైన శైలిలో జీవితాన్ని గడుపుతున్నారు. అందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ కు మీరు ధన్యవాదాలు చెప్పాలి’’ అని ఓ ఎక్స్ యూజర్ కామెంట్ చేశాడు.