
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. జీవో 9పై హైకోర్టు స్టే విధించటంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడిపోయింది. అయితే ఈ అంశంపై బీసీ సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 14వ తేదీన తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నామని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రకటించారు.



