Bank of Baroda Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 627 పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
భారత్ లోని ప్రముఖ బ్యాంక్ ల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా లో మేనేజీరియల్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా మొత్తం 627 పోస్ట్ లను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజీరియల్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ bankofbaroda.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 627 పోస్టులను భర్తీ చేయనుంది.
లాస్ట్ డేట్ జులై 2
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో జులై 2వ తేదీ వరకు దరఖాస్తులు పంపించవచ్చు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.
ఖాళీల వివరాలు
- డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్ & డేటా ఇంజనీర్ : 4 పోస్టులు
- అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్ & డేటా ఇంజనీర్ : 9 పోస్టులు
- ఆర్కిటెక్ట్ : 8 పోస్టులు
- జోనల్ సేల్స్ మేనేజర్ : 3 పోస్టులు
- అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ : 20 పోస్టులు
- సీనియర్ మేనేజర్ : 22 పోస్టులు
- మేనేజర్ : 11 పోస్టులు
- రేడియెన్స్ ప్రైవేట్ సేల్స్ హెడ్ : 1 పోస్టు
- గ్రూప్ హెడ్ : 4 పోస్టులు
- టెరిటరీ హెడ్ : 8 పోస్టులు
- సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ : 8 పోస్టులు 234 పోస్టులు
- ఈ-వెల్త్ రిలేషన్ షిప్ మేనేజర్లు: 26 పోస్టులు
- ప్రైవేట్ బ్యాంకర్-రేడియెన్స్ ప్రైవేట్: 12 పోస్టులు
- గ్రూప్ సేల్స్ హెడ్ (వర్చువల్ ఆర్ ఎం సేల్స్ హెడ్): 1 పోస్టు
- వెల్త్ స్ట్రాటజిస్ట్ (ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్సూరెన్స్)/ ప్రొడక్ట్ హెడ్: 10 పోస్టులు
- పోర్ట్ ఫోలియో రీసెర్చ్ అనలిస్ట్: 1 పోస్టు
- ఏవీపీ- అక్విజిషన్ అండ్ రిలేషన్ షిప్ మేనేజర్: 19 పోస్టులు
- ఫారెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్ షిప్ మేనేజర్: 15 పోస్టులు
- క్రెడిట్ అనలిస్ట్: 80 పోస్టులు
- రిలేషన్ షిప్ మేనేజర్: 66 పోస్టులు
- సీనియర్ మేనేజర్ - బిజినెస్ ఫైనాన్స్ : 4 పోస్టులు
- చీఫ్ మేనేజర్ - ఇంటర్నల్ కంట్రోల్స్ : 3 పోస్టులు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్ సైట్ bankofbaroda.in లోని నోటిఫికేషన్ ద్వారా విద్యార్హతలు, వయోపరిమితిని తదితర వివరాలను తెలుసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ
విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తరువాత వారిని తదుపరి రౌండ్ పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు
దరఖాస్తు ఫీజు జనరల్ /ఈడబ్ల్యూఎస్ , ఓబీసీ అభ్యర్థులకు రూ.600/- ఇన్ ఫర్మేషన్ ఛార్జీలు (నాన్ రీఫండబుల్ ), ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళా అభ్యర్థులకు రూ.100 (ఇన్ఫర్మేషన్ ఛార్జీలు మాత్రమే) వర్తిస్తాయి. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటిని ఉపయోగించి స్క్రీన్ పై అడిగిన సమాచారాన్ని అందించడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ bankofbaroda.in చూడవచ్చు.