BSF Recruitment 2024 : వివిధ పోస్టుల భర్తీకి బీఎస్​ఎఫ్​ రిక్రూట్​మెంట్​- అప్లికేషన్​ ప్రక్రియ షురూ..-bsf recruitment 2024 application begins for 1526 capf assam rifles vacancies ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bsf Recruitment 2024 : వివిధ పోస్టుల భర్తీకి బీఎస్​ఎఫ్​ రిక్రూట్​మెంట్​- అప్లికేషన్​ ప్రక్రియ షురూ..

BSF Recruitment 2024 : వివిధ పోస్టుల భర్తీకి బీఎస్​ఎఫ్​ రిక్రూట్​మెంట్​- అప్లికేషన్​ ప్రక్రియ షురూ..

Sharath Chitturi HT Telugu
Jun 11, 2024 12:02 PM IST

BSF Recruitment 2024 online apply : వివిధ పోస్టుల భర్తీకి బీఎస్​ఎఫ్​ రిక్రూట్​మెంట్ ప్రక్రియను మొదలుపెట్టింది. అప్లికేషన్​ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

బీఎస్​ఎఫ్​ రిక్రూట్​మెంట్​ 2024
బీఎస్​ఎఫ్​ రిక్రూట్​మెంట్​ 2024

BSF Recruitment 2024 online apply date : సెంట్రల్ ఆర్మడ్​ పోలీస్ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్)లో 1526 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్), అస్సాం రైఫిల్స్​లో వారెంట్ ఆఫీసర్, హవిల్దార్ పోస్టుల భర్తీకి.. బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఆన్​లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్​ కోసం rectt.bsf.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 8 రాత్రి 11:59 గంటలు.

బీఎస్​ఎఫ్​ రిక్రూట్​మెంట్​ 2024 డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఏఎస్ఐ స్టెనో, కాంబాట్ స్టెనో, వారెంట్ ఆఫీసర్ (పర్సనల్ అసిస్టెంట్)

బీఎస్ఎఫ్ పురుష, మహిళా ఖాళీల సంఖ్య : 17

సీఆర్పీఎఫ్ పురుషులు, మహిళలు : 21

ఐటీబీపీ పురుషులు, మహిళలు : 56

సీఐఎస్ఎఫ్ పురుషులు, మహిళలు : 146

ఎస్ఎస్బీ పురుషులు, మహిళలు: 3

హెచ్​సీఎం, హవిల్దార్ క్లర్క్ ఖాళీలు

BSF Recruitment 2024 last date : బీఎస్ఎఫ్ పురుష, మహిళ : 302

సీఆర్పీఎఫ్ పురుషులు, మహిళలు : 282

ఐటీబీపీ పురుషులు, మహిళలు: 163

సీఐఎస్ఎఫ్ పురుషులు, మహిళలు : 496

ఎస్ఎస్బీ పురుషులు, మహిళలు : 5

ఏఆర్ పురుషులు, మహిళలు : 35

అభ్యర్థుల వయోపరిమితి 2024 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

BSF Recruitment 2024 age limit : ఈ ఖాళీలకు అవసరమైన కనీస విద్యార్హతలు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12 వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతలు.

దరఖాస్తు ఫీజు రూ.100. రిజర్వేషన్ కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులు, ఎక్స్​ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

బీఎస్​ఎఫ్​ రిక్రూట్​మెంట్​ 2024కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

యూపీఎస్సీ నోటిఫికేషన్..

డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ కెమిస్ట్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర పోస్టుల భర్తీకి యూపీఎస్​సీ చేపట్టిన రిక్రూట్​మెంట్​ ప్రక్రియ ఈ నెల 13తో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు జూన్ 13, 2024లోగా యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ upsconline.nic.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు..

ర్కియాలజీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్: 4 పోస్టులు

ఆర్కియాలజీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్: 67 పోస్టులు

సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, ఇంటిగ్రేటెడ్ హెడ్క్వార్టర్స్ (నేవీ), డైరెక్టరేట్ ఆఫ్ సివిలియన్ పర్సనల్: 4 పోస్టులు

UPSC recruitment 2024 : స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫోరెన్సిక్ మెడిసిన్): 6 పోస్టులు

స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ మెడిసిన్): 61 పోస్టులు

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం