UPSC recruitment 2024 : యూపీఎస్సీ నోటిఫికేషన్​- పోస్టుల వివరాలు.. ఇలా అప్లై చేసుకోండి-upsc recruitment 2024 notification for over 300 vacancies out check details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Recruitment 2024 : యూపీఎస్సీ నోటిఫికేషన్​- పోస్టుల వివరాలు.. ఇలా అప్లై చేసుకోండి

UPSC recruitment 2024 : యూపీఎస్సీ నోటిఫికేషన్​- పోస్టుల వివరాలు.. ఇలా అప్లై చేసుకోండి

Sharath Chitturi HT Telugu
Published May 28, 2024 11:10 AM IST

UPSC recruitment latest news : వివిధ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ను ఇక్కడ చెక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.

యూపీఎస్సీ నోటిఫికేషన్​- పోస్టుల వివరాలు,,
యూపీఎస్సీ నోటిఫికేషన్​- పోస్టుల వివరాలు,,

UPSC recruitment 2024 apply online : డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ కెమిస్ట్, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ని విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). అర్హులైన అభ్యర్థులు జూన్ 13, 2024లోగా యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ upsconline.nic.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

యూపీఎస్సీ నోటిఫికేషన్​- వేకెన్సీ వివరాలు..

  • ఆర్కియాలజీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్: 4 పోస్టులు
  • ఆర్కియాలజీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్: 67 పోస్టులు
  • సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్, ఇంటిగ్రేటెడ్ హెడ్క్వార్టర్స్ (నేవీ), డైరెక్టరేట్ ఆఫ్ సివిలియన్ పర్సనల్: 4 పోస్టులు
  • UPSC recruitment 2024 : స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఫోరెన్సిక్ మెడిసిన్): 6 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ మెడిసిన్): 61 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జరీ): 39 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్ నెఫ్రాలజీ): 3 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్స్): 23 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్-3 (అనస్థీషియాలజీ): 2 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్-3 (డెర్మటాలజీ, వెనీరియాలజీ అండ్ లెప్రసీ): 2 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్-3 (జనరల్ మెడిసిన్): 4 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్ -3 (జనరల్ సర్జరీ): 7 పోస్టులు
  • UPSC notification 2024 : స్పెషలిస్ట్ గ్రేడ్ -3 (అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ): 5 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్ -3 (ఆప్తాల్మాలజీ): 3 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్ -3 (ఆర్థోపెడిక్స్ ): 2 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్ -3 ఓటో-రైనో-లారింగాలజీ (చెవి, ముక్కు, గొంతు): 3 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్ -3 (పీడియాట్రిక్స్ ): 2 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్ -3 (పాథాలజీ): 4 పోస్టులు
  • స్పెషలిస్ట్ గ్రేడ్ -3 (సైకియాట్రీ): 1 పోస్టు
  • ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (టెక్నికల్) (డీసీఐఓ/టెక్): 9 పోస్టులు
  • అసిస్టెంట్ డైరెక్టర్ (హార్టికల్చర్): 4 పోస్టులు
  • అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-2 (ఐఈడీఎస్) (కెమికల్): 5 పోస్టులు
  • అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-2 (ఐఈడీఎస్) (ఫుడ్): 19 పోస్టులు
  • అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-2 (ఐఈడీఎస్) (ఐఈడీఎస్) (ఐఈడీఎస్): 12
  • పోస్టులు అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-2 (ఐఈడీఎస్) (లెదర్ అండ్ ఫుట్వేర్): 8 పోస్టులు
  • అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-2 (ఐఈడీఎస్)
  • ఇంజినీర్ అండ్ షిప్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (టెక్నికల్): 2 పోస్టులు
  • ట్రైనింగ్ ఆఫీసర్ (ఉమెన్ ట్రైనింగ్) - డ్రెస్ మేకింగ్: 5 పోస్టులు
  • ట్రైనింగ్ ఆఫీసర్ (ఉమెన్ ట్రైనింగ్) - ఎలక్ట్రానిక్ మెకానిక్: 3 పోస్టులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (యూరాలజీ): 1 పోస్టు

విద్యార్హతలు:

  • UPSC recruitment notification : పైన పేర్కొన్న ప్రతి పోస్టుకు అర్హతలు మారవచ్చని దరఖాస్తుదారులు గమనించాలి. నోటిఫికేషన్​ని సరిగ్గా, పూర్తిగా చదవాలని యూపీఎస్సీ సూచించింది.
  • అభ్యర్థులు వివిధ పోస్టులకు నిర్దేశించిన కనీస అర్హతలను కలిగి ఉండాలి. అర్హతకు సంబంధించి సలహాలు కోరే ఏ విచారణనూ పరిగణనలోకి తీసుకోబోమని కమిషన్ పేర్కొంది.
  • ఒక్కో పోస్టుకు సంబంధించిన పూర్తి విద్యార్హతలను నోటిఫికేషన్​లో తెలుసుకోవచ్చు.

వయోపరిమితి:

  • ప్రతి పోస్టుకు వయోపరిమితి ఒక్కో విధంగా ఉంటుంది. అభ్యర్థులు వయోపరిమితి వివరాల కోసం నోటిఫికేషన్ చూడవచ్చు.

దరఖాస్తు విధానం:

  • upsconline.nic.in అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.
  • వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ప్రక్రియ కోసం క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయండియ
  • అప్లికేషన్ ట్యాబ్​పై క్లిక్ చేసి వివరాలు నింపాలి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్​లో పేర్కొన్న అన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఫారమ్ సబ్మిట్ చేయండి. భవిష్యత్తు రిఫరెన్స్ కోసం డౌన్​లోడ్​ చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ:

Government jobs latest news : వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే, షార్ట్​లిస్ట్​ ప్రక్రియ ఉంటుంది. లేదా..

  • అవసరమైన అర్హత (DQ) ఆధారంగా లేదా ఒకటి కంటే ఎక్కువ DQ సూచించినట్లయితే ఏదైనా ఒకటి లేదా అన్ని DQలు.
  • ప్రకటనలో నిర్దేశించిన కనీస విద్యార్హతల కంటే ఎక్కువ విద్యార్హతల ఆధారంగా..
  • ప్రకటనలో నిర్దేశించిన కనీస స్థాయి కంటే సంబంధిత రంగంలో అధిక అనుభవం ఆధారంగా.
  • అవసరమైన అర్హతలను పొందడానికి ముందు లేదా తరువాత అనుభవాన్ని లెక్కించడం ద్వారా.
  • ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ (ఈక్యూ) లేదా డిజైరబుల్ క్వాలిఫికేషన్ (డీక్యూ)గా పేర్కొనని అనుభవం లేని సందర్భాల్లో కూడా అనుభవాన్ని ఉపయోగించడం ద్వారా.
  • రిక్రూట్​మెంట్ టెస్ట్ నిర్వహించడం ద్వారా.. సాధారణంగా రిక్రూట్ మెంట్ టెస్ట్ లో మార్కులకు 75:25 నిష్పత్తిలో వెయిటేజీ, తుది మెరిట్ ను నిర్ణయించడంలో ఇంటర్వ్యూలో మార్కులకు వెయిటేజీ ఇస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.