Bagmati Express: గూడ్స్ రైలును ఢీకొన్న భాగ్ మతి ఎక్స్ ప్రెస్; పట్టాలు తప్పిన రెండు బోగీలు
తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దర్భంగా నుంచి మైసూరు వెళ్లే భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు గూడ్స్ రైలు ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో భాగమతి ఎక్స్ ప్రెస్ కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు.
గూడ్స్ రైలును ఢీకొన్న భాగ్ మతి ఎక్స్ ప్రెస్
తమిళనాడులోని కవరపేటలో శుక్రవారం సాయంత్రం ఎక్స్ ప్రెస్ రైలు, ఆగి ఉన్న సరుకు రవాణా రైలు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
ఆగి ఉన్న గూడ్స్ ను ఢీ కొన్న రైలు
బిహార్ లోని దర్భంగా నుంచి మైసూరు వెళ్లే భాగమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో భాగమతి ఎక్స్ ప్రెస్ కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటన స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి అంబులెన్స్ లను తరలిస్తున్నారు.