Amit Shah praises AAP govt: ‘‘ఆశ్చర్యం.. ఆప్ ప్రభుత్వానికి అమిత్ షా అభినందనలు’’-amit shah praises punjab s aap govt over amritpal singh crackdown ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amit Shah Praises Aap Govt: ‘‘ఆశ్చర్యం.. ఆప్ ప్రభుత్వానికి అమిత్ షా అభినందనలు’’

Amit Shah praises AAP govt: ‘‘ఆశ్చర్యం.. ఆప్ ప్రభుత్వానికి అమిత్ షా అభినందనలు’’

HT Telugu Desk HT Telugu
Apr 22, 2023 04:01 PM IST

బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ల ఉప్పు నిప్పులా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇటీవలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ విచారణ రెండు పార్టీల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచింది. ఇటీవల ఒక కార్యక్రమంలో బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పంజాబ్ ఆప్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (PTI)

Amit Shah praises AAP govt: బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల ఉప్పు నిప్పులా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇటీవలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ, ఈడీ విచారణ రెండు పార్టీల మధ్య శత్రుత్వాన్ని మరింత పెంచింది. అయితే, ఇటీవల ఒక కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పంజాబ్ లోని ఆప్ (AAP) ప్రభుత్వాన్ని ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Amit Shah praises AAP govt: అమృత్ పాల్ సింగ్ విషయంలో..

ఖలిస్తానీ ఉద్యమ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ను అదుపులోకి తీసుకునే విషయంలో పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం సమర్ధవంతంగా పని చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రశంసించారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. త్వరలోనే అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ను అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో లాగా పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) స్వేచ్ఛగా తిరగడం లేదని, ఆయన కార్యకలాపాలన్నింటిపై నిఘా ఉందని వివరించారు. పంజాబ్ లో ఖలిస్తాన్ వేర్పాటు ఉద్యమానికి మద్దతు పెరుగుతోందన్న వాదనను అమిత్ షా కొట్టివేశారు. పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ కార్యకలాపాలను, రాష్ట్రంలో పరిస్థితిని కేంద్రం నిశితంగా గమనిస్తోందన్నారు. పంజాబ్ లో ఖలిస్తాన్ వేవ్ లేదన్నారు. ‘‘పంజాబ్ లో ఖలిస్తాన్ వేవ్ లేదు. చాలా సార్లు, చాలా మంది ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) విషయంలో పంజాబ్ ప్రభుత్వం ప్రశంసనీయంగా పని చేసింది. అందులో కేంద్రం కూడా సపోర్ట్ చేసింది’’ అని అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు. త్వరలోనే అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) కటకటాల వెనక్కు వెళ్తారన్నారు.

Attack at the Indian commissions: విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడి..

విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడులు (attack at the Indian commissions) చేయడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటుందన్నారు. ఇటీవల యూకేలోని లండన్, అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో ల్లో ఇండియన్ ఎంబసీలపై ఖలిస్తాన్ మద్ధతుదారులు దాడులు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. భారత రాయబార కార్యాలయాలపై దాడులను సహించబోమన్నారు. ఆ దాడుల విషయాన్ని ఎన్ఐఏ (NIA) చూసుకుంటుందని Amit Shah వెల్లడించారు. భారత్ కు వ్యతిరేకంగా విదేశాల్లో జరిగే కుట్రలను ఎన్ఐఏ (NIA) సమర్ధవంతంగా ఎదుర్కోగలదన్నారు.

Whats_app_banner