Amul in Karnataka : కర్ణాటకలో అమూల్​ ఎంట్రీపై వివాదం.. 'నందిని'కే ప్రజల మద్దతు!-amid row over amul s foray bengaluru hoteliers decide to use nandini milk to support state s farmers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amul In Karnataka : కర్ణాటకలో అమూల్​ ఎంట్రీపై వివాదం.. 'నందిని'కే ప్రజల మద్దతు!

Amul in Karnataka : కర్ణాటకలో అమూల్​ ఎంట్రీపై వివాదం.. 'నందిని'కే ప్రజల మద్దతు!

Sharath Chitturi HT Telugu
Apr 09, 2023 11:26 AM IST

Amul in Karnataka : కర్ణాటకలో అమూల్​ ఎంట్రీ వ్యవహారంపై దుమారం రేగుతోంది! నందిని మిల్క్​తో పాటు రాష్ట్రంలోని రైతులను నాశనం చేసేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్​ ఆరోపిస్తోంది.

కర్ణాటకలో అమూల్​ ఎంట్రీపై వివాదం.. నందినికే ప్రజల మద్దతు!
కర్ణాటకలో అమూల్​ ఎంట్రీపై వివాదం.. నందినికే ప్రజల మద్దతు! (HT_PRINT)

Amul in Karnataka : దేశంలోని దిగ్గజ పాల ఉత్పత్తి సంస్థ అమూల్​ ఏంట్రీ విషయంపై కర్ణాటకలో వివాదం చెలరేగింది. స్థానిక పాడి రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్​ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న 'నందిని మిల్క్​'కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. నందిని మిల్క్​నే వాడాలని బెంగళూరులోని హోటల్స్​ తాజాగా నిర్ణయించాయి!

అసలేం జరిగిందంటే..

లాంచ్​ అలర్ట్​ అన్న హ్యాష్​ట్యాగ్​తో కర్ణాటకలో ఎంట్రీ ఇస్తున్నట్టు ఇటీవలే ట్వీట్​ చేసింది అమూల్​ సంస్థ. పాలు, పెరుగు డెలవరీ కోసం ఓ ఈ కామర్స్​ వేదికను సిద్ధం చేస్తున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో కేఎంఎఫ్​ (కర్ణాటక మిల్క్​ ఫౌండేషన్​).. గుజరాత్​ అమూల్​ (ఆనంద్​ మిల్క్​ యూనియన్​ లిమిటెడ్​)లో విలీనమవుతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ విషయంపై కర్ణాటకవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక ఇప్పుడు బృహత్​ బెంగళూరు హోటల్స్​ అసోసియేషన్​ కీలక నిర్ణయం తీసుకుంది.

Amul row in karnataka : "కన్నడిగులు నందిని పాల ఉత్పత్తులనే వినియోగించాలి. మా రైతులు తయారు చేస్తున్న నందిని మిల్క్​ చూసి మాకు గర్వంగా ఉంది. నందిని మిల్క్​నే అందరు ప్రోత్సహించాలి. మా నగరంలో కాఫీకి చాలా విశిష్టత ఉంది. మేము వినియోగించే పాలు అలాంటివి మరి. బయట రాష్ట్రాల నుంచి పాలు కర్ణాటకలోకి వస్తున్నట్టు తెలుస్తోంది. మేము వాటిని వ్యతిరేకిస్తున్నాము. నందినికే మా మద్దతు," అని అమూల్​ డైరీ పేలు ఎత్తకుండా.. ఓ ప్రకటన జారీ చేసింది బీబీహెచ్ఏ. నందిని పాలనే వినియోగిస్తామని స్పష్టం చేసింది.

రాజకీయ దుమారం..

త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో 'అమూల్​' ఎంట్రీపై రగడ మొదలైంది. రాష్ట్రంలోని డైరీ బ్రాండ్​ నందినిని నాశనం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్​ ఆరోపించింది.

Karnataka Amul row : "అమూల్​ ఉత్పత్తులే కొంటామని కన్నడిగులు ప్రతిజ్ఞ చేయాలి. కేఎంఎఫ్​ విలీనాన్ని అడ్డుకోవాలి. రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన కేఎంఎఫ్​ను కాపాడుకోవాలి. అమూల్​ ఉత్పత్తులను కర్ణాటక ప్రజలు కొనుగోలు చేయకూడదు. బీజేపీ.. మాపై ఇప్పటికే హిందీని రుద్దుతోంది. ఇప్పుడు సరిహద్దులను ఆక్రమించుకుంటూ డైరీని తీసుకొస్తోంది. ఇది రాష్ట్రంలోని రైతులకు నష్టం కలిగిస్తుంది," అని మండిపడ్డారు కాంగ్రెస్​ సీనియర్​ నేత సిద్ధరామయ్య.

Nandini milk Karnataka : ఈ వ్యవహారంపై సీఎం బసవరాజ్​ బొమ్మై జోక్యం చేసుకోవాలని, అమూల్​ను రాష్ట్రంలోకి రానివ్వకూడదని సిద్ధరామయ్య డిమాండ్​ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్​ షాతో పాటు రాష్ట్ర బీజేపీ ప్రభుత్ వైఫల్యంతోనే కేఎంఎఫ్​ వ్యాపారం దెబ్బతిందని ఆరోపించారు.

Whats_app_banner