Amarnath Yatra 2023 : నేటి నుంచి అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్లు..-amarnath yatra 2023 registration begins today 17th april here s how to register ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Amarnath Yatra 2023 : నేటి నుంచి అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్లు..

Amarnath Yatra 2023 : నేటి నుంచి అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్లు..

Sharath Chitturi HT Telugu
Apr 17, 2023 08:23 AM IST

Amarnath Yatra 2023 : ఈ ఏడాది జులై 1న ప్రారంభంకానున్న అమర్​నాథ్​ యాత్రలో పాల్గొనాలని భావిస్తున్నారా? అయితే మీకు ముఖ్యమైన అప్డేట్​. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది.

నేటి నుంచి అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్లు..
నేటి నుంచి అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్లు..

Amarnath Yatra 2023 registration : హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్​నాథ్​ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేడు ప్రారంభంకానుంది. జమ్ముకశ్మీర్​లో 62రోజుల పాటు సాగే అమర్​నాథ్​ యాత్ర 2023 జులై 1న మొదలవుతుంది. ఆగస్టు 31తో ముగుస్తుంది.

దక్షిణ కశ్మీర్​లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఈ అమర్​నాథ్​ ఆలయం ఉంటుంది. అనంతనాగ్​ జిల్లా పహల్గామ్​, గండర్​బాల్​ జిల్లా బల్టాల్​ మార్గాల్లో 2023 అమర్​నాథ్​ యాత్ర కొనసాగుతుంది. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. www.jksasb.nic.in. వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. అయితే 13-70ఏళ్ల మధ్యలో ఉన్న వారే ఈ యాత్రలో పాల్గొనగలరు. అదే సమయంలో 6నెలల గర్భంతో ఉన్న మహిళలు కూడా యాత్రకు వెళ్లలేరు.

2023 అమర్​నాథ్​ యాత్రి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ..

Amarnath Yatra 2023 dates : స్టెప్​ 1:- అమర్​నాథ్​ ఆలయ బోర్డుకు చెందిన అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- ఆన్​లైన్​ సర్వీస్​ ట్యాబ్​ మీద క్లిక్​ చేస్తే 'రిజిస్టర్​' కనిపిస్తుంది. దాన్ని క్లిక్​ చేయాలి.

స్టెప్​ 3:- కొత్త పేజ్​ ఓపెన్​ అవుతుంది.

స్టెప్​ 4:- సంబంధిత వివరాలను వెల్లడించాలి. సబ్మీట్​ చేయాలి.

స్టెప్​ 5:- ఓటీపీ వెరిఫై చేసుకోవాలి.

Amarnath Yatra 2023 : స్టెప్​ 6:- అప్లికేషన్​ ప్రాసెసింగ్​ జరుగుతుంది. ఎస్​ఎంఎస్​ వస్తుంది.

స్టెప్​ 7:- అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి.

స్టెప్​ 8:- అమర్​నాథ్​ యాత్ర పర్మీట్​ కాపీని డౌన్​లోడ్​ చేసుకోవాలి.

Amarnath Yatra 2023 latest updates in Telugu : దేశవ్యాప్తంగా ఉన్న పీఎన్​బీ, ఎస్​బీఐ, జమ్ముకశ్మీర్​ బ్యాంక్​, యెస్​ బ్యాంక్​ బ్రాంచ్​లలో అమర్​నాథ్​ యాత్రకు సంబంధించిన అడ్వాన్స్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. ఎస్​ఏఎస్​బీ మొబైల్​ అప్లికేషన్​ ద్వారా కూడా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. ఈ యాప్​ గూగుల్​ ప్లే స్టోర్​లో ఉంటుంది.

అడ్వాన్స్​ రిజిస్ట్రేషన్​ కోసం రూ. 120 చెల్లించాలి. అమర్​నాథ్​ యాత్ర రిజిస్ట్రేషన్​ ఫీజు రూ. 220. ఎన్​ఆర్​ఐ భక్తులు పీఎన్​బీ బ్యాంక్​లో రిజిస్ట్రేషన్​ చేసుకుంటే రూ. 1520 చెల్లించాలి.

Whats_app_banner

సంబంధిత కథనం