Stocks to buy today : ట్రేడర్స్.. నేటి 'స్టాక్స్ టు బై' లిస్ట్ ఇదే!
Stocks to buy today in telugu : ట్రేడర్స్ ట్రాక్ చేయాల్సిన నేటి స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. అవేంటంటే..
Stocks to buy today in Telugu : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌తో.. వరుస నష్టాలకు బ్రేక్ వేశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఆటోలో కొనుగోళ్ల జోరుతో.. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 59,141 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 0.52శాతం పెరిగి 17,622కు చేరింది.
బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.16శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.17శాతం వృద్ధిచెందాయి.
అయితే.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ నెగిటివ్‌గా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 18000 మార్కును దాటితే.. మార్కెట్లలోకి బుల్స్ తిరిగి వచ్చినట్టు భావించవచ్చని అంటున్నారు. 17,450 దిగువకు మార్కెట్ చేరితే.. మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ప్రకటన త్వరలో వెలువడనుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు ఇది అత్యంత కీలకంగా మారింది. ఈ ప్రకటన కోసం మదుపర్లు వేచి చూస్తున్నారు. ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత.. స్టాక్ మార్కెట్లు ఓ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది.
Stocks to buy today : స్టాక్స్ టు బై:-
- అంబుజా సిమెంట్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్- రూ. 534, టార్గెట్- రూ. 610.
- పిడిలైట్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్- రూ. 2720, టార్గెట్ రూ. 2,920.
- ఇండియా సిమెంట్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్- రూ. 286, టార్గెట్- రూ. 305.
- Stock market news today : ఎం అండ్ ఎం:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్- రూ. 1275, టార్గెట్ రూ. 1320.
- బజాజ్ ఫినాన్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్- రూ. 7052, టార్గెట్- రూ. 7994.
- రెయిన్బో హాస్పిటల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్- రూ. 622, టార్గెట్- రూ. 722.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. నిపుణుల సూచనలతో హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ట్రేడర్లకు సొంతంగా అనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం