Jammu Kashmir terrorism : జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతకు భారీ స్కెచ్​- 4వేల మందితో..-500 para commandos to hunt pakistani terrorists in jammu kashmir after attacks ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jammu Kashmir Terrorism : జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతకు భారీ స్కెచ్​- 4వేల మందితో..

Jammu Kashmir terrorism : జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతకు భారీ స్కెచ్​- 4వేల మందితో..

Sharath Chitturi HT Telugu
Jul 20, 2024 12:10 PM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం సన్నద్ధమైంది. ఇప్పటికే భారీ స్థాయిలో అదనపు బలగాలను మోహరిస్తోంది. టెర్రరిస్ట్​లు, వారికి సాయం చేస్తున్న వారిని పట్టుకునేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు.

ఉగ్రవాదుల వేటలో భారత సైన్యం..
ఉగ్రవాదుల వేటలో భారత సైన్యం.. (HT_PRINT)

జమ్ముకశ్మీర్​లో పెరుగుతున్న ఉగ్రవాదుల చొరబాట్లు, ఇప్పటికే ఆ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న టెర్రరిస్టులను అంతం చేసేందుకు భారత సైన్యం భారీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు సైనిక బలగాల మోహరింపును అడ్జెస్ట్​ చేస్తోందని సమాచారం.

ఉగ్రవాదుల వేటలో సైన్యం..

50-55 మంది ఉగ్రవాదుల వేట కోసం 500కుపైగా మంది పారా స్పెషల్​ ఫోర్స్​ కమాండోలను భారత సైన్యం జమ్ముకశ్మీర్​లో మోహరించినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో నిఘా వ్యవస్థల ఫోకస్​ మరింత పెరిగినట్టు, ఉగ్రవాదులకు సహాయం చేసే వారిని, అండర్​గ్రౌండ్​ వర్కర్లను పట్టుకునే పనిలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్​ చర్యలను అడ్డుకునేందుకు ఇప్పటికే 3,500-4000 మంది అదనపు భద్రతా బలగాలను జమ్ముకశ్మీర్​లో మోహరించినట్టు స్పష్టం చేశాయి.

ఉగ్రవాదుల గాలింపు, వారి అంతంపై క్షేత్రస్థాయిలో సైనికులు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. వారి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నట్టు సమాచారం. వీరందరు, ఇప్పటికే జమ్ముకశ్మీర్​లో ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్​ దళాలకు సాయం చేయనున్నాయి.

జమ్ముకశ్మీర్​కు ఆర్మీ చీఫ్​..

మరోవైపు ఉగ్ర కార్యకలాపాలు పెరుగుతున్న జమ్ముకశ్మీర్​లో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నేడు పర్యటించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలోని గ్రౌండ్ సెక్యూరిటీ ఫోర్స్​ సన్నద్ధతను సమీక్షించనున్నారు. జమ్ముకశ్మీర్ లో భద్రతా పరిస్థితులపై జరిగే సమావేశంలో జనరల్ ఉపేంద్ర ద్వివేదికి భద్రతా దళాలు తీసుకుంటున్న ప్రాంతాల గురించి ఫార్మేషన్ కమాండర్లు వివరించనున్నారు. పారామిలటరీ బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు, భారత సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు.

ఆర్మీ చీఫ్ జమ్ముకశ్మీర్​లో పర్యటించడం ఈ నెలలో ఇది రెండోసారి. అంతకుముందు జూలై 3న ఆయన పూంచ్-రాజౌరీ సెక్టార్​ని సందర్శించి నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించారు. జూలై 16న దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్​కౌంటర్​లో కెప్టెన్ బ్రిజేష్ థాపాతో సహా నలుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించిన తర్వాత జనరల్ ఉపేంద్ర ద్వివేది కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటించారు.

జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30న భారత ఆర్మీ కమాండ్​గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన మూడు రోజులకే ఆర్మీ చీఫ్ జమ్ముకశ్మీర్​లో పర్యటించి సరిహద్దు జిల్లా పూంచ్​కు వెళ్లారు. పూంచ్​లో ఫీల్డ్ కమాండర్ల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన ఫార్వర్డ్ ప్రాంతాలను ఏరియల్ రివ్యూ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం